
కాంగ్రెస్ మరచిన రాజకీయ నాయకులను బీజేపీ పూజిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ రహిత దేశంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. అందుకే కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయ స్వాతంత్ర్య సమరయోధుల పుట్టిన రోజులు, వర్ధంతులను తెలుసుకొని మరీ దానికో దినోత్సవం ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. ఈ తరహా పూజలతో కాంగ్రెస్ దివంగత నేతల పేర్లు గల్లంతవుతున్నారు. దీనిపై కాంగ్రెస్ ఆందోళనగా ఉంది..
ఇటీవలే మదన్ మోహన్ మాలవ్య,వాజ్ పేయ్ లకు భారత రత్న ఇచ్చిన మోడీ, వివేకానందుడి బర్త్ డేనాడు యువజన దినోత్సవం ప్రకటించారు. యోగా డేను, భారత రుషులను పూజిస్తున్నారు. కాంగ్రెస్ వాసనలైన రాజీవ్, ఇందిర పేర్లను పండగలను తొలగిస్తున్నారు.
నిన్నటికి నిన్న భారత రాజ్యాంగనిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో పంచ్ తీర్థ్ ప్రదేశాలు అంబేద్కర్ పేరుమీద అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అంతేకాదు అంబేద్కర్ బర్త్ డే నాడు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ వాసనలు పోయి దేశానికి బీజేపీ అలవాట్లు వస్తున్నాయి..