
ఇంటర్నెట్ లేకుండా ప్రపంచమే లేదు.. సోషల్ మీడియా వెబసైట్స్ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంకా ఏదైనా ఇంటర్నెట్ పైనే ఆధారపడి పునాదులు నిర్మించుకున్నాయి. అలాంటి ఇంటర్నెట్ భారత్ వంటి పెద్ద దేశాల్లో వినియోగం పెరిగినా.. ఇంకా చాలా గ్రామాలకు ఇంటర్నెట్ లేదు. అందుకే ఉచిత ఇంటర్నెట్ అందించేందుకు ప్రయత్నించాం. నెట్ న్యూట్రాలటీని గౌరవిస్తాం కానీ ఇంటర్నెట్ ను అందిరికీ అందుబాటులోకి తేవాలన్నదే మా ప్రయత్నం. ఉచిత ఇంటర్నెట్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం అని ప్రకటించారు ఫేస్ బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకెర్ బర్గ్.
ఢిల్లీ ఐఐటీ ప్రాంగణంలో విద్యార్థులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. భారత్ లో అందిరికీ ఇంటర్నెట్ కల్పించకుండా ప్రపంచాన్ని అనుసంధానించడం అసాధ్యమని అందుకే మా ఉచిత ఇంటర్నెట్ పై నెట్ యూజర్లు విమర్శలు చేయవద్దని పేర్కొన్నారు.