మిస్డ్ కాల్ ప్రేమ సూసైడ్ కు దారితీసింది.

ఆదిలాబాద్ :  పోలీస్ స్టేషన్ లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేగింది. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం పొనకల్ కు చెందిన బాలిక(15) కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూర్ కు చెందిన టేకులపల్లి రాజేందర్(32) కు మిస్డ్ కాల్ ద్వారా పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో నమ్మించిన రాజేందర్ తనతో తీసుకెళ్లిపోయాడు.

బాలికకు తల్లిదండ్రులు లేరు. అమ్మమ్మ వద్ద ఉంటోంది. బాలికకు పెళ్లి సంబంధాలు ఖాయం చేస్తుండడంతో ప్రియుడు మాటలు నమ్మి అతనితో వెళ్లిపోయింది. కాగా రాజేందర్ కు అప్పటికే పెళ్లి అయి భార్య , ముగ్గురు పిల్లలు ఉన్నారు.

లేచిపోయిన జంటను పోలీసులు పట్టుకుని ఖానాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడ జంట వెంట తెచ్చుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం మెట్ పల్లి ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తనకు పెళ్లై, పిల్లలు ఉన్నా రాజేందర్ మాయమాటలతో బాలికను లోబరుచుకుని వెంట తీసుకెళ్లి చివరకు ఇలా ఆత్మహత్యయత్నానికి కు పాల్పడడంతో వారి ఇరువురు కుటుంబాల్లో విషాదం నింపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *