మిషన్ వాటర్ కన్సర్వేషన్ లో పాల్గొన్న జూపల్లి

మిషన్ వాటర్ కన్సర్వేషన్-సహజ వనరుల సద్వినియోగం పై హోటల్ మారిగోల్డ్ లో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్, హాజరైన పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు*

స్వాతంత్ర్యం వచ్చి 70 ఎల్లవుతున్నా ఇంకా నీటి సంరక్షణపై అవగాహన పెంచుకోలేకపోయాం

సహజ వనరుల సద్వినియోగం, నీటి రక్షణ ద్వారానే కరువును పూర్తిగా తరిమేయగలము

కరువును పారద్రోలేందుకు దశాబ్దాల క్రితమే అన్నా హజారే లాంటి వాళ్ళు ఎంతో కృషి చేసారు

ప్రతి నీటి బొట్టును ఎక్కడికక్కడ సంరక్షిస్తేనే మెరుగైన ఫలితాలొస్తాయి, నీటి సంరక్షణలో కేరళ ఆదర్శనీయం

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతి ఎకరా పొలానికి ఫార్మ్ పాండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయి

కొత్త రాష్ట్రం అయినా హరితహారం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది, ప్రజా భాగస్వామ్యం తోనే ఇది సాధ్యమైంది

నీటి సంరక్షణలోను ప్రజా చైతన్యం ద్వారా దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 గా నిలుపుదాం

*వర్క్ షాప్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు*

హైదరాబాద్ : స్వాతంత్రo వచ్చి 70 ఏళ్లవుతున్నా ఇంకా నీటి సంరక్షణపై అవగాహన పెంచుకోలేకపోయామని… ఇప్పటికైనా ఈ అంశాన్ని ఉద్యమ తరహాలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మిషన్ వాటర్ కన్సర్వేషన్-సహజ వనరుల సద్వినియోగం పై హైదరాబాద్ లోని హోటల్ మారిగోల్డ్ లో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…కరువును పూర్తిస్థాయిలో తరిమేసేందుకు సహజ వనరుల సద్వినియోగం, నీటి రక్షణ ఒక్కటే మార్గం అన్నారు. కరువును పారద్రోలేందుకు దశాబ్దాల క్రితమే అన్నా హజారే లాంటి వాళ్ళు ఎంతో కృషి చేసారని, ఆ దిశగా మనం కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నీటి బొట్టును ఎక్కడికక్కడ సంరక్షిస్తేనే మెరుగైన ఫలితాలొస్తాయని, నీటి సంరక్షణలో కేరళ రాష్ట్రం ఆదర్శనీయంగా ఉందన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతి ఎకరా పొలానికి ఫార్మ్ పాండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి సంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. కరువు నెలల్లోనూ నీటి సంరక్షణ ద్వారా సిరులు పండిస్తున్నారని, అనంతపూర్ జిల్లాలో జరిగిన యదార్థ సంఘటనని ఉదహరించారు మంత్రి జూపల్లి. కొత్త రాష్ట్రం అయినా హరితహారం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని, ప్రజా భాగస్వామ్యం తోనే ఇది సాధ్యమైందన్నారు. నీటి సంరక్షణలోను ప్రజా చైతన్యం ద్వారా దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 గా నిలుపుదామని పిలుపునిచ్చారు. కరువు జిల్లాగా మహబూబ్నగర్ కు పేరుండేదని, ఆ జిల్లాలోనూ నీటి సంరక్షణకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. ఆ దిశగా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాల్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రైతు పొలంలో ఫాo పాండ్, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటిని సంరక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. నీటి సంరక్షణకు నిధుల కొరత లేదని, ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. నీటి సంరక్షణపై పలువురు నిపుణులు వర్క్ షాప్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, డీ ఆర్ డీ ఓలు, ఏ పీడీలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో కమీషనర్ నీతూ ప్రసాద్, ఫారెస్ట్స్ ప్రిన్సిపల్ చీఫ్ కాన్సెర్వేటర్ పీకే ఝా, వ్యవసాయ శాఖా కమీషనర్ జగన్మోహన్, ఎన్నారెస్సీ డిప్యూటీ డైరెక్టర్ పీ వీ ఎన్ రావు, హార్టికల్చర్ కమీషనర్ వెంకట్రామ్ రెడ్డి, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంటు డైరెక్టర్ దనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఈజీఎంఎం ఫినిషింగ్ స్కూల్ ని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి

మాసబ్ ట్యాంక్ లోని ఈజీఎంఎం ఫినిషింగ్ పాఠశాలను పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, వీటి కోసం పక్కా భవనాలను నిర్మించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

jupaly krishna rao.     jupaly krishna rao..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *