మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానం

 

*హైదరాబాద్: మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నగరంలోని ఎర్రమంజిల్ జలసౌధలో ఘనంగా జరిగింది. మీడియా అవార్డుల కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ పథకంపై సమగ్రంగా ఆకట్టుకునే విధంగా కథనాలు రాసిన.. టీవీల్లో ప్రసారం చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు మంత్రి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనకు ప్రతిరూపమే మిషన్ కాకతీయ పథకమని తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టారన్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు పునర్‌వైభవం సమకూరుతుందన్నారు. చెరువు మరమ్మతు పనులు ఉద్యమంలా సాగుతున్నాయన్న ఆయన చెరువును నమ్ముకున్న అందరికీ జీవనాధారం లభించేలా మిషన్ కాకతీయ పనితీరు ఉందన్నారు. మిషన్ కాకతీయపై జర్నలిస్టులు అద్భుతమైన ఆర్టికల్స్ రాశారన్నారు. భావితరాలకు ఉపయోగపడే మిషన్ కాకతీయ లాంటి పథకాలపై జర్నలిస్టులు ఎక్కువ దృష్టిని సారించాలని కోరారు. ఈ యేడాది 4 లక్షల 30 వేల ఎకరాలను సాగులోకి తెచ్చినట్లు తెలిపారు. 9 గంటల విద్యుత్ సరఫరా, చెరువు పూడికతీతతో ఈసారి రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్పారు. గతంలో పూడికతో నిండి.. చెరువులు కట్టలుతెగి నీరు వృథాగా పోయేది. కాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ వల్ల నీటి నిల్వలు పెరిగాయన్నారు. వచ్చే ఏడాది నుంచి బెస్ట్ ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్‌లకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.*

katta shekha reddy

katta shekha reddy

allam naresized_DSC_0031

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *