మిషన్ కాకతీయ ఫేజ్ – 1 పనులు సత్వరమే పూర్తిచేయాలి: నీతూ ప్రసాద్

కరీంనగర్: మిషన్ కాకతీయ కార్యక్రమం ఫేజ్-1 ద్వారా చేపట్టిన పనులు సత్వరమే పూర్తిచేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మిషన్ కాకతీయ కార్యక్రమ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫేజ్-1 క్రింద జిల్లాలో 1188 చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టగా, 1088 చెరువుల సర్వే పూర్తయినట్లు, 1030 చెరువుల అంచనాలు పంపినట్లు, 822 చెరువుల పనులకు పరిపాలన అనుమతులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. 802 చెరువుల పనులకు టెండర్లు అప్ లోడ్ చేసి, 800 చెరువుల పనులకు అగ్రిమెంట్లు పూర్తిచేసినట్లు, ఇప్పటికి 204 చెరువుల పనులు పూర్తిచేసినట్లు కలెక్టర్ తెలిపారు. మిగులు చెరువుల పనులు వివిధ దశల్లో వున్నట్లు, వీటి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కాంట్రాక్లర్లపై పనులు పురోగతిన వత్తిడి చేయాలన్నారు. 75 శాతం పనులు పూర్తయిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి మిగులు పనులు వెంటనే చేయాలన్నారు. అదే విధంగా మిషన్ కాకతీయ ఫేజ్-2 కార్యక్రమం క్రింద 1271 చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టి, 1161 చెరువుల సర్వే పూర్తిచేసినట్లు, 1115 చెరువుల అంచనాలు పంపినట్లు, 423 చెరువుల పరిపాలన అనుమతులు వచ్చినట్లు కలెక్టర్ అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు వెంట వెంటనే చేపట్టాలన్నారు. పనుల విషయంలో సమస్యలు తలెత్తితే సంబంధత శాఖల సమన్వయంతో అధిగమించాలన్నారు. శిఖం, పట్టా తదితర విషయాల్లో రెవిన్యూ శాఖ ప్రాధాన్యతతో వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం కావున అధికారులు వ్యక్తిగత శ్రద్దతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ గౌతం, జిల్లా రెవిన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, నీటిపారుదల ఎస్ఇ వెంకటక్రిష్ణ, జెడి అగ్రికల్చర్
వై.సుచరిత, డిడి ఫిషరీస్ దేవేందర్, ఎడి గ్రౌండ్ వాటర్ హరికిషన్, నీటిపారుదల శాఖ ఇఇలు, డిఇలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *