మిషన్ కాకతీయ ప్రభావం పై నాబ్ కాన్ అధ్యయన నివేదికను విడుదల చేసిన హరీష్ రావు

మిషన్ కాకతీయ ప్రభావం పై NABCON అధ్యయన నివేదికను ఆదివారం నాడు జలసౌధలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో విడుదల చేశారు.ఈ అధ్యయనం తీరుపై నాబ్ కాన్ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. మిషన్ కాకతీయ కార్యక్రమం అమలు తర్వాత వివిధ అంశాలపై  వాటి ప్రభావాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి నమోదు చేయడానికి నాబార్డుచే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది.  NABCON  గత సంవత్సరం తమ అధ్యయనాన్ని ప్రారంభించినారు. తమ అధ్యయన ఫలితాలను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించారు. వారి అధ్యయన ఫలితాలు సంక్షిప్తంగా ఈ విధంగా ఉన్నాయి.

I. అధ్యయన పద్దతి :

మిషన్ కాకతీయ మొదటి దశలో ఎంపిక చేసిన చెరువులున్న గ్రామాల్లో చెరువుల కింద ఆయకట్టు రైతాంగ కుటుంబాల్లో సర్వే, వారితో చర్చలు ,ఉపగ్రహ చిత్రాల పరిశీలన , విశ్లేషణ , కొన్ని చేరువులపై  కేస్స్టడీ, ఇతరత్రా లభ్యమయ్యే సమాచారం ఆధారంగా మిషన్ కాకతీయ ప్రభావాలను అధ్యయనం , మదింపు చేయడం జరిగింది. 2013 – 14 సంవత్సరాన్ని మిషన్ కాకతీయ అమలుకు ముందు సమాచార సేకరణకు బేస్ లైన్ సంవత్సరంగా, 2016-17 సంవత్సరాన్ని మిషన్ కాకతీయ అమలు తర్వాత సమాచార సేకరణకు ప్రభావ సంవత్సరంగాస్వీకరించడం జరిగింది. 400 చెరువు గ్రామాల్లో 12 వేల కుటుంబాలను సర్వే కోసం ఎంపిక చేయడం జరిగింది. 400 చెరువులు పాత ఆదిలాబాద్ , కరీం నగర్ , మెదక్, నల్గొండ జిల్లాల్లో భిన్నమైన ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ లో విస్తరించి ఉన్నాయి.

II. అధ్యయన ప్రాంతం స్వరూప స్వభావాలు :

సర్వే కోసం  ఎంపిక చేసిన  కుటుంబాల్లో55.3 % ఇతర బి సి కులాలు , 21.4 % ఎస్ సి కులాలు , 12.3 % ఉన్నత కులాలు , 11% ఎస్ టి లకు చెందినవి. ఇక విద్య్యపరమైన అర్హతలను చూసినప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో  36.8 % కుటుంబాల్లో కనీసం ఒక్కరైనా పడవ తరగతి లేదా అంతకు మించి చదుకొన్నవారు ఉన్నారు. ఇక కరీం నగర్ జిల్లాలో67.7 % , మెదక్ జిల్లాలో 62.7 % , నల్గొండ జిల్లాలో 44.3 % పడవ తరగతి లేదా అంతకు మించి చదువు ఉన్నవారు కనీసం ఒక్కరైనా ఉన్నారు.సర్వేకు ఎంపిక చేసిన కుటుంబాల్లో 60 % సన్నకారు రైతులు,29.2 % చిన్నకారు రైతులు , , 10.7 % మధ్యస్త రైతులు, 0.1 % మాత్రమే పెద్ద రైతులు చెరువుల ఆయకట్టులో ఉన్నారు. కుటుంబాలకు ఉన్న భూమి విస్తీర్ణం చూసినప్పుడు 11.2 % రైతులకుఅర  ఎకరం  కంటే తక్కువ , 60.7 % రైతులకుఅర ఎకరం నుంచి 2 ఎకరాల వరకు , 22% రైతులకు 2 నుంచి 5 ఎకరాల వరకు , 5.2 % రైతులకు 5 ఎకరాలకు పైబడి భూమి కలిగి ఉన్నారు.

III. సర్వే ప్రాంతంలో వర్షపాతం:

సర్వే కోసం ఎంపిక చేసిన అన్ని జిల్లాల్లో  నైరుతీ ఋతు పవనాలు బేస్ లైన్ సంవత్సరంగా ఎంపిక చేసిన 2013-14 తో పోల్చి చూసినప్పుడు 2016 సంవత్సరంలో ఆలస్యంగా రావడం, ఆశాజనకంగా లేకపోవడంతో ఖరీఫ్ పంటని దేబ్బతీసింది. దీని ప్రభావం ముఖ్యంగా మెదక్ , నల్గొండ జిల్లాపై అధికంగా ఉన్నది.

IV. ప్రభావాలు మిషన్ కాకతీయ i) సాగు విస్తీర్ణం :

1. 2016 ఖరీఫ్ లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోయినా కూడా మిషన్ కాకతీయ అమలు కారంణంగా 51.5% సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ పెరుగుదల రబీ పంట కాలంలో ఎక్కువగా నమోదు అయ్యింది. కారణం 2016 లో సెప్టెంబరు మూడో వారంలో కురిసిన వర్షాలకు చెరువులు నిండినాయి. ఈ నిష్పత్తిలో లెక్కవేసినప్పుడు రాష్ట్రంలో చెరువుల కింద  సుమారు 10.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడుతుంది.  2. ఖరీఫ్, రబీ రెండు పంట కాలాలను కలుపుకుంటే సాగు విస్తీర్ణం పెరుగుదల ( Intensity అఫ్ Irrigation)
45.6 % గా ఉన్నది. జిల్లాల వారీగా చూసినప్పుడు నల్గొండలో 22.5 % అతి తక్కువ  ,  కరీం నగర్ లో 62.5% అతి ఎక్కువగా నమోదు అయ్యింది. 2013-14 లో ఇంటెన్సిటి ఆఫ్ ఇర్రిగేషన్ రాష్ట్రంలో 88.4% గా ఉంటే 2016- 17 లో 134 % కి పెరిగింది.  3. 2013-14 ఈ‌గ్యాప్ ఆయకట్టు 42.4 % ఉంటే 2016-17 లో 23.2 % ఉన్నది. మిషన్ కాకతీయ అమలు తర్వాత ఆయకట్టులో గ్యాప్ 19.2 % (ఖరీఫ్& రబీ కలుపుకొని) శాతానికి తగ్గింది.

ii) భూగర్భ జలాలు :

4. పునరుద్దరణ పొందిన చెరువుల  ఆయకట్టులో బావులు, బోరు బావులు హెడ్ రీచ్ నుంచి టెయిల్ రీచ్ దాకా సమంగానే విస్తరించి  ఉన్నాయి.  సర్వేకి ఎంపిక చేసిన చెరువుల తూములను రైతులందరి స్వచ్చంద అనుమతితో మూసి వేసినారు. దీనితో భూగర్భ జలాలు పెరుగుతాయని బావులు, బోరు బావులకు నీరు బాగా అందుతుందని వారి అనుభవం. 5. వారి అంచనాలకు అనుగుణంగానే మొత్తంగా ఆయకట్టులో ఉన్న 17 %  ఎండిపోయిన బావులు , బోరు బావులు తిరిగి పునర్జీవనం పొందినాయి. ఇవి ఆయకట్టు ప్రాంతంలో , ఆయకట్టు బయట కూడా ఉన్నట్లు అధ్యయనంలో  తేలింది. 6. 2013-14 బేస్ సంవత్సరంలో భూగర్భ జలాల మట్టం  6.91 మీ ఉంటే 2016-17 లో అది 9.02 కు పెరిగినట్లు నమోదు అయ్యింది.

iii) పంటల విస్తీర్ణంలో పెరుగుదల :

7. మిషన్ కాకతీయ అమలు అయిన తర్వాత చెరువుల్లో నీటి నిల్వ పెరిగిన కారణంగా నీటి లభ్యత పెరిగినందున,  వరి పంట సాగు 49.2% నుంచి 62.1% కు పెరిగినట్లుగా నమోదు అయ్యింది. మిషన్ కాకతీయ ప్రభావాలు మరింత స్పష్టంగా  2016-17 రబీలో నమోదు అయ్యింది.2016-17 రబీ సీజన్ లో కరీఫ్ లో సాగు అయిన వారి పంట విస్తీర్ణం కంటే 7.2 % పెరిగిందని అయ్యింది.  8. పత్తిసాగు విస్తీర్ణం 36.2 % నుంచి 26.3 % నికి తగ్గింది. అట్లనే ఇతర పంటల విస్తీర్ణంలో కూడా తగ్గుదల కనిపించింది. కారణం వరి సాగుకు కావల్సిన నీటి  లభ్యత పెరిగింది.

iv) పంటల దిగుబడి :
9. వరి పంట దిగుబడి 4.1 % , పత్తి పంట దిగుబడి 4.7 % పెరిగినట్లుగా రికార్డు అయ్యింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంట దిడుబడి కూడా పెరగడం అంటే చెరువుల పునరుద్దరణ వలన నీటి నిల్వ పెరిగి నీటి లభ్యత పెరిగిందనడానికి సూచనగా భావించవచ్చు.

v) పూడిక మట్టి , రసాయన ఎరువుల వినియోగం :

10. సర్వే కోసం ఎంపిక  చేసిన ఆయకట్టు రైతు  కుటుంబాల్లో 8.5 % కుటుంబాలు పూడిక మట్టిని తమ చెలకల్లో, పొలాల్లో చల్లుకున్నారు. పూడిక మట్టిని ప్రధానంగాఆయకట్టుకు ఆవల  చౌడు భూముల్లో , మొరం భూముల్లో చల్లుకున్నట్లుగానమోదు అయ్యింది. పూడిక మట్టి చల్లుకున్నందున రైతులకు ప్రధానంగా రసాయనిక , పురుగు మందుల కొనుగోలులో ఖర్చు తగ్గింది. పంట దిగుబడి ద్వారా ఆదాయం పెరిగింది.
11. పూడిక మట్టిని చల్లుకున్నరైతు  కుటుంబాలకు రసాయనిక ఎరువుల వాడకం  35 నుంచి 50 % తగ్గింది. రైతుకు రసాయనిక ఎరువుల కొనుగోళ్లపై 27.6 %   ఆర్ధిక భారం తగ్గింది. ఇది ఎకరానికి రూ. 1500 నుంచి రూ. 3000 వరకు పంట రకాన్ని బట్టి  ఉన్నదని  అధ్యయనంలో తేలింది. 12. పూడిక మట్టిని చల్లుకున్న రైతులకు మంచి ప్రయోజనాలు దక్కినాయి. అట్టి  పొలాల్లో పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. నెలలో తెమను నిలుపుకునే సామర్థ్యం పెరిగింది.  పంటల దిగుబడిలో పెరుగుదల ఈ విధంగా నమోదు అయ్యింది. వరి దిగుబడి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్ళు పత్తి దిగుబడి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు కందుల దిగుబడి ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు
మక్క దిగుబడి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు

vi) చేపల పెంపకం :

12. సర్వే కోసం ఎంపిక చేసిన మిషన్ కాకతీయ  చెరువుల్లో 70 % చెరువుల్లో 3 నుంచి 6 నేలలలు మాత్రమే నీటి నిల్వ ఉంటుంది. 20% చెరువుల్లో 6 నుంచి 9 నెలలు నీటి నిల్వ ఉంటుంది. 10% చెరువుల్లో మాత్రమే సంవత్సరం పొడుగూతా నీటి నిల్వ ఉంటుంది. మొత్తంగా ఈ చెరువుల్లో 2013-14 బేస్ సంవత్సరంతో పోల్చినప్పుడు 2016-17 సంవత్సరంలో చేపల ఉత్పత్తి  36-39 %  పెరిగినట్లు నమోదు అయ్యింది.

vii) పెరిగిన ఆదాయం :

13. చెరువు ఆయకట్టు పరిధిలో ఉన్న ప్రాంతంలో కుటుంబాల  సరాసరి ఆదాయం 78.5 % పెరిగింది. కారణం చెరువు ఆయకట్టులో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలను మార్కెట్లో  కల్పించినందున బేస్ ఇయర్ తో పోల్చి చూసినప్పుడు వ్యవసాయ ఆదాయం 47.4 % పెరిగినట్లుగా నమోదు అయ్యింది.

viii) మిషన్ కాకతీయ తర్వాత చెరువుల పరిస్తితి :

14. మిషన్ కాకతీయ అమలుకు ముందు చెరువుల పరిస్తితి పై చెరువులున్న గ్రామాల్లో ప్రజలనుఅడిగినప్పుడు 63 % చెరువులు బాగా లేవని , 3 % చెరువులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ మొదటి దశ అమలు తర్వాత 46.7 % చెరువులు చాలా బాగున్నాయని , 38 % చెరువులు బాగు పడ్డాయని ,11.2 % సంతృప్తికరంగా ఉన్నాయని , కేవలం 4.1 % చెరువులు బాగా లేవని ప్రజలు అభిప్రాయపడినారు. మిషన్ కాకతీయ విజయవంతంగా అమలు అయిన తర్వాత చెరువుల నిర్వహణ కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అధ్యయనం ద్వారా స్పష్టం అయ్యింది.  15. మిషన్ కాకతీయ ఫలితాలపై ప్రభుత్వానికి ఉన్న అంచనా ఈ అధ్యయనం ద్వారా నిజమని నిర్ద్వందంగా తేలిపోయింది. ఈ అధ్యయనం పరిధిలో లేని మరొకఅంశాన్ని 2016-17 లో సాగునీటి శాఖ గమనించింది.ఈ ఏడు సెప్టెంబరులో కురిసిన వర్షం 100 ఏండ్లకు ఒక్కసారి వచ్చే పెద్ద వర్షం. అయినా కూడా మిషన్ కాకతీయలో చెరువు కట్టలు బలోపేతం అయిన కారణంగా వరదలకు తెగిపోయిన చెరువులు , ఇతరత్రా నష్టపోయిన  చెరువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వేల సంఖ్యలో నష్టానికి గురి అయ్యే చెరువులు వందల్లోకి పడిపోయినాయి. బాగా వర్షాలు పడిన సంవత్సరాల్లో నష్టపోయిన చెరువుల సంఖ్య ఈ విధంగా ఉన్నది. 2009
లో 1107 , 2010 లో 4251, 2013 లో 1868, 2016 లో కేవలం 571 మాత్రమే.  అది మిషన్ కాకతీయలో చెరువు కట్టలను బలోపేతం చేసినందువల్లనే సాధ్యమయ్యింది.  16. మిషన్ కాకతీయ కార్యక్రమంలో పునరుద్దరణకు నోచుకున్న చెరువుల్లోకి పుష్కలంగా నీరు వచ్చి
చేరినందున2016-17  రబీ పంట కాలానికి చెరువుల కింద సాగునీరు పుష్కలంగా అందింది. రెండేండ్ల వరుస కరువుల అనంతరం చెరువుల్లోకి నీరు చేరింది. గత 10 ఏండ్ల నుంచి తమ ఊరి చెరువుల్లో నీరు చూడని గ్రామస్తులు పునరుద్దరణ అనంతరం చెరువులు నీటితో కళకళలాడుతుంటే చూసి ఉప్పొంగి పోతున్నారు.

17. గత రబీ సీజన్ లో చెరువుల కింద  15 లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. ఇది ఒక రికార్డు. పంట దిగుబడి గణనీయంగా పెరిగినట్లు మార్కెటింగ్ శాఖ ద్వారా ధాన్యం ,ఇతర పంటల కొనుగోళ్ళ ద్వారా తెలుస్తున్నది. మిషన్ కాకతీయ ఫలితాలు మొదటిసారిగా 2016 -17లో రైతుల అనుభవంలోనికి వచ్చింది . మిషన్ కాకతీయ విజన్ సఫలం అవుతున్నది. 2017-18 రబీలో కూడా గత సంవత్సరపు అనుభవాలు పునరావృతం కాబోతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.