
ఎండిన చెరువు.. రైతు గుండెకు బరువు.. నీటితో కళకళాలాడ్సిన చెరువులు వట్టిపోయి కళావిహీనంగా కనపడుతున్నాయి. ఆంధ్రా సర్కారు పాలనలో చెరువల దశ తీరక అడుగంటిపోయిన చెరువు నీటిని మళ్లీ ఒడిసి పట్టేందుకు ప్రారంభించిన ‘మిషన్ కాకతీయ’ ఈ ఎండా కాలంలో ప్రారంభంకానుంది. తెలంగాణలోని 9 వేల చెరువులకు మిషన్ కాకతీయలో బాగుచేసి పూడిక తీయనున్నారు. నీటితో చెరువు నిండితే రైతుల పంటలకు ఆదరువు., తెనుగోళ్ల చేపలకు కొలువు, ఉపాధి, ఇంకా చాలా మంది బతుకు భరోసా.. అందుకే మిషన్ కాకతీయ కు రంగం సిద్ధమైంది. ఇక ఊళ్లల్లో పలుగు, పార పట్టి చెరువులను బాగు చేయడమే మిగిలింది.
మిషన్ కాకతీయ ప్రోగ్రాంను జనంలో కి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే , కళాకారుడు రసమయి బాలకిషన్ నేతృత్వంలో ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. చెరువులను బాగు చేయాలనే తలంపుతో రూపొందిన ఈ లఘు చిత్రంలో కేసీఆర్ స్పీచ్, హరీష్ రావు చెరువు తవ్వడం, మిషన్ కాకతీయపై యువన్ సురేష్ సంగీతంలో వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాట అలరిస్తోంది. ఆ మిషన్ కాకతీయ లఘు చిత్రం మనకోసం..