మిషన్ కాకతీయతో తెలంగాణ సస్యశ్యామలం

హైదరాబాద్ : భూగర్భ జలం అడుగంటింది.. జనం గొంతెండుతోంది. ఈ వేసవి క‘న్నీటి’ కష్టాలకు వేదికైంది. పచ్చని పంటపొలాలతో కళాకళాలాడిల్సిన ఆయకట్టు ఎడారిలా దర్శనం ఇస్తోంది. ఈ నేపథ్యంలో చెరువుల ప్రాధాన్యం గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమంతో ‘మన ఊరు-మన చెరువు’కు శ్రీకారం చుట్టింది. దీంతో మన చెరువులు వచ్చే ఏడు జల కళతో ఉట్టిపడతాయి. తాగునీటి సమస్య తీరుతుంది.ఆయకట్టు అభివృద్ధి చెందుతుంది. రైతుల ఇంట సిరుల పంట కురుస్తుంది.. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి ప్రజలు సైతం ఏకమై తమ ఊరి చెరువులను బాగుచేసుకుంటే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది.

కేసీఆర్ డైరెక్షన్.. హరీష్ యాక్షన్..
సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన మిషన్ కాకతీయకు మంత్రి హరీష్ ఊపిరిలూదారు. తెలంగాణ మంత్రి వర్గంలోని ఏ మంత్రి చేయని రీతిలో అద్భుత ప్రతిభతో దీన్ని ఎల్లలు దాటించాడు. దేశ విదేశాల్లో ప్రాచుర్యం కల్పించారు. దీంతో మన ఊరి చెరువుల దశ మారుతోంది. నిధులు వెల్లువెత్తుతున్నాయి.. పారిశ్రామిక వేత్తలు, బడాసంస్థలు, రిటైర్డ్ ఉద్యోగులు చెరువుల దత్తతకు ముందుకు వస్తున్నారు. పాడైపోయిన చెరువులను బాగు చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ కార్పొరేట్ సంస్థలు సైతం లక్షలకు లక్షలు మిషన్ కాకతీయ విరాళాలు అందజేస్తున్నాయి. దీంతో తెలంగాణ ఇప్పుడు చెరువుల పూడికతీతలో బిజీగా ఉంది.

చెరువుల్లో నీటిని ఒడిసిపట్టాలి
ఆకాశం నుంచి పడే చుక్కను ఒడిసి పట్టే ఈ అద్భుత కార్యక్రమానికి చిన్నా పెద్దా వెన్నుదన్నుగా నిలబడుతూ ఓ భగీరత యత్నానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో  చెరువులకు జీవ కళ మళ్లీ సంతరించుకోనుంది. వచ్చే వర్షా కాలం నాటికి చెరువులు నీటి కళతో కళకళాలాడాలి. అందుకు చెరువు కాంట్రాక్టర్లు, అధికారులు ప్రభుత్వ సొమ్మును పారదర్శకంగా ఖర్చుపెట్టాలి. గ్రామాల గతిన మార్చే ఈ ప్రక్రియలో అవినీతి లేకుండా చూడాలి. ఇందుకు ప్రజలు, యువజన సంఘాలు, మహిళ సంఘాలు చెరువు పూడికతీతలో భాగస్వాములై పారదర్శకంగా జరిగేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు చెరువులు నీటితో నిండుతాయి. లేదంటే ‘చెరువు నీళ్ళు చెరువెనుక పడ్డాక చేసేదేం లేదన్నట్టు ’ తయారవుతుంది పరిస్థితి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *