మిషన్ కాకతీయకు విదేశీయులు డబ్బు పంపొచ్చు..

మిషన్ కాకతీయ.. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మహాయజ్ఞం , మంత్రి హరీష్ సారథ్యంలో తెలంగాణలోని గ్రామాల చెరువుల రూపురేఖలు మార్చే ఈ మహత్తర పథకానికి కేంద్రం మద్దతు కూడా లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ ట్రస్టుకు ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్న ఎన్ ఆర్ ఐలు, ప్రవాస భారతీయులు డబ్బు పంపేందుకు అనుమతి లేదు.. ఎందుకంటే ట్రస్టులకు విదేశాల నుంచి నిధులు రావాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి.. ఈ నేపథ్యంలో నే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ పథకాని్కి నిధులు వచ్చేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది..

కాగా చెరువులు బాగు పడి అభివృద్ది జరిగే ఈ కార్యక్రమానికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. మిషన్ కాకతీయ ట్రస్టుకు విదేశాల నుంచి ఎన్ ఆర్ ఐ లనుంచి డబ్బులు వచ్చేందుకు వీలుగా అనుమతి మంజూరు చేసింది..

దీంతో ఇక విదేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్ ఆర్ ఐలు నేరుగా మిషన్ కాకతీయకు నిధులు విరాళాలుగా ఇవ్వవచ్చు..  ఇందుకోసం హైదరాబాద్ లోని పంజాగుట్ట ఎస్ బీ హెచ్  ఖాతా నంబర్ 62400709179లో నేరుగా విరాళాలను జమ చేయవచ్చు. కేంద్రం అనుమతి మంజూరు చేయడంపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. విరాళాలను ఎన్ఆర్ఐ లు విరివిగా ఇవ్వాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *