మిమ్మల్ని బంధించేస్తా..

tula uma

ఆమె ఫొటో తీయాలనుకొనలేదు.. కానీ  సందర్భం అలాంటిది మరి..  ఆమె కళను ప్రదర్శించాలనుకోలేదు.. కానీ ఆ కోరిక కలిగేలా చేసింది కార్యక్రమం.. అంతే అక్కడే ఉన్న ఒక కెమెరాతో తన కళకు పదును పెట్టింది కరీంనగర్ జడ్పీచైర్మన్ తుల ఉమ.. తనలోని కుంచెను బయటకు తీసింది. మంత్రిని, ఎంపీని కెమెరాలో బంధించింది..

కరీంనగర్ ప్రెస్ క్లబ్.. ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం ఉత్సాహంగా ప్రారంభమైంది. అన్ని పత్రికల ఫొటో గ్రాఫర్లు.. రిపోర్టర్లు, చానెల్ ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ చూపిన ఫొటో గ్రాఫర్లకు షీల్డ్ లు, ప్రశంస పత్రాలు అందజేశారు కార్యక్రమానికి అందజేసిన మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జడ్పీ చైర్మన్ తుల ఉమ.. కాగా జడ్పీ చైర్మన్ తుల ఉమ కొత్త అవతారం ఎత్తారు. ఓ కెమెరాతో మంత్రిని, ఎంపీని ఇలా ఫొటో తీసి ముచ్చట తీర్చుకున్నారు. తుల ఉమ ఫొటో తీస్తుంటే మంచిగా నవ్వతూ ఫొజులిచ్చారు మంత్రి, ఎంపీ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *