మినీ బస్సులను అందుబాటులోకి తీసుకోస్తున్న తెలంగాణ

ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు కొత్త పథకాన్ని టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి  తీసుకొస్తోంది. ప్రయాణికుల దగ్గరకే బస్ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని సర్వేలో తేలడంతో ఈ నిర్ణయం  తీసుకుంది. వజ్ర పేరుతో  దీపావళి నుంచి మిని ఏసీ బస్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఆర్టీసీ. మొదట విడతగా హైదరాబాద్ టూ వరంగల్, హైదరాబాద్ టూ నిజామాబాద్ రూట్లలో నిడిచేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.  హైదరాబాద్ టూ వరంగల్ కు 300 రూపాయలు, హైదరాబాద్ టూ నిజామాబాద్ కు 350 రూపాయలు రేటు ఫిక్స్ చేశారు. దీపావళి నుంచి ప్రారంభించే వజ్ర సర్వీస్ కు.. మొదటిగా 50 బస్సులను తర్వాత మరో 50 బస్సులను నడిపిస్తున్నామంటున్నారు అధికారులు. ఈ సర్వీస్ కు బస్సులో టికెట్ ఇవ్వరని …  టికెట్ల కోసం WWW.TSRTCONLINE.INవెబ్ సైట్, బస్టాండ్లు, ఆర్టీసీ వాలెట్, ఎం-వాలెట్ తో టికెట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ ను రూపొందిస్తున్నారు. గ్రూప్ బుకింగ్  చేసుకుంటే 10శాతం డిస్కౌంట్ కూడా అందజేస్తామంటున్నారు. ఇది సక్సెస్ అయితే.. గ్రామీణ ప్రాతాల్లో మరో 136 నాన్ ఏసీ బస్సులను ప్రవేశపెడతామంటున్నారు.

హైదరాబాద్ టూ వరంగల్ కు నాలుగు రూట్లు ఏర్పాట్లు చేశారు. ఒకటో రూట్ లోని బస్సులు  సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, నాగోల్ క్రాస్ రోడ్, ఉప్పల్ క్రాస్ రోడ్డు మీదుగా వరంగల్ చేరుకుంటాయి.  రెండో రూట్ వెళ్లే బస్సులు… మెహిదీపట్నం, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అంబర్ పేట్, ఉప్పల్ క్రాస్ రోడ్డు మీదుగా వరంగల్ కు చేరుకుంటాయి. రూట్ నెంబర్ 3లో నడిచే బస్సులు కేపీహెచ్ బీ, బాలానగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ క్రాస్ రోడ్డు మీదుగా వరంగల్ వెళ్తాయి. రూట్ నెంబర్ 4లోని బస్సులు AS రావు నగర్, ESIL, హబ్సిగూడ, ఉప్పల్ క్రాస్ రోడ్డు చేరుకొని  వరంగల్ వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ రూట్లలో హైదరాబాద్ లో 100 బోర్డింగ్ పాయింట్లు, వరంగల్ లో 46 డ్రాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు మూడు రూట్లు ఏర్పాటు చేశారు. ఒకటో రూట్ లోని  బస్సులు వరంగల్, బీఎస్ కాశీబుగ్గ, హన్మకొండ, కాజిపేట్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. రూట్ నెంబర్ 2..లో నడిచే బస్సులు పోచమ్మ మైదాన్, వరంగల్ చౌరస్తా, బస్ స్టేషన్, హంటర్ రోడ్, జులివాడ, సుబేదారి, కాజీపేట్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. రూట్ నెంబర్ 3లోని బస్సులు  కిషన్ పుర, భీమారం, గోపాలపురం, వాడెపల్లి చర్చ్, ఎక్సైజ్ కాలనీ, సుబేదారి, కాజీపేట్ మీదుగా హైదరాబాద్ కు చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

హైదరాబాద్ టూ నిజామాబాద్ కు మూడు రూట్లు ఏర్పాటు చేశారు. ఒకటో రూట్ వెళ్లే బస్సులు ఎల్ బీ నగర్, కొత్తపేట్, నాగోల్ క్రాస్ రోడ్, తార్నాక, సంగీత్, బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నిజామాబాద్ చేరుకుంటాయి. రెండో రూట్ లో వెళ్లే బస్సులు కెపీహెచ్ బీ, బాలానగర్, బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నిజామాబాద్ వెళతాయి. రూట్ నెంబర్ 3లోని బస్సులు మెహిదీపట్నం, ఎస్ఆర్ నగర్, బల్కంపేట్, బాలానగర్, బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నిజామాబాద్ కు చేరుకుంటాయి.నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కూడా మూడు రూట్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఒకటో రూట్ లో నడిచే బస్సులు ఆర్టీవో కార్యాలయం, నాగారం, ఓల్డ్ బస్ స్టేషన్, పులాంగ్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. రూట్ నెంబర్ రెండులోనిబస్సులు.. అర్సపల్లి, పీఎల్ డీ బస్  స్టేషన్, రైల్వేస్టేషన్, పులాంగ్ మీదుగా హైదరాబాద్ వస్తాయి. రూట్ నెంబర్ 3లోని బస్సులు  ముబారక్ నగర్, కంటేశ్వర్, సుభాష్ నగర్, న్యూ వినాయకనగర్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. MGBS, జూబ్లీ బస్టాండ్ల నుంచి రెగ్యులర్ బస్సులు ఉండటంతో.. ఈ బస్సులు అటూ వైపు వెళ్లయంటున్నారు అధికారులు. కొత్తగా చేపడుతున్న ఈ ప్రణాళికతో ఆర్టీసీకి లాభాల సిరులు కురిపిస్తాయని చెబుతున్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.