
బీజేపీకి, టీడీపీకి మధ్య ఎడం పెరుగుతోంది.. బీజేపీ ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో ఇక బీజేపీకి, టీడీపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ నేతలు టీడీపీకి చిర్రెత్తేలా ఇటీవల బెజవాడలో సమావేశం పెట్టి మాట్లాడడంతో ఇక ప్రత్యేక హోదా కాక మొదలైంది.. బీజేపీకి టీడీపీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఇప్పుడు మారింది.. కేంద్రంలో బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై టీడీపీ సభ్యులు సైతం చంద్రబాబును ప్రశ్నించారు. మరో రెండేళ్లు ఒపికపడదామని ఒకవేళ ఈ లోపు కూడా బీజేపీ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయకపోతే బీజేపీతో కటీఫ్ చేసుకోవడానికి వెనుకడామని చంద్రబాబు నాయకులకు స్పష్టం చేశారట.. హామీలు ఇచ్చి సాయం చేయని బీజేపీ-టీడీపీ బంధంపై ఇప్పటికే రాష్ట్రాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. మరోసారి ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీతో అంటకాగితే అసలు కే మోసం వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట..
అందుకే ఇటీవల వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో మాట్లాడిన చంద్రబాబుకు ఏపీకి అన్యాయం చేస్తున్నారని.. నిదులు విడుదల చేయడం లేదని ఐఏఎస్ అధికారిపై నిప్పులు చెరిగారు.. ఇవన్నీ పరిణామాలు చంద్రబాబు, మోడీ ప్రభుత్వంపై అసహనానికి కారణంగా తెలుస్తోంది.. అందుకే ప్రస్తుతానికి బీజేపీతో వైరం పెంచుకోవద్దని.. అలాగే ఎన్నికల ముందు మాత్రం హామీలు నెరవేర్చకపోతే విడిపోవడమే టీడీపీ భవిష్యత్తుకు మేలని అభిప్రాయం టీడీపీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది..