Breaking News

మిడ్ మానేరు ముంపు బాధితుల దీక్ష భగ్నం చేయడం దారుణం

01

కరీంనగర్ : మిడ్ మానేరు ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేసి వారిని పోలీసులు బలవంతంగా ఎత్తుకొచ్చి కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేసి చేతులు దులుపుకున్నారని కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగా వారిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి అడ్లూరి లక్ష్మన్ కుమార్, పరామర్శించి నిర్వాసితుల న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ తరఫున పోరాడుతామన్నారు..

02

నిర్వాసితులను పోలీసులు దీక్షా స్థలి నుంచి బలవంతంగా తీసుకొచ్చి ఆసుపత్రిలో పడేశారని.. వారికి బెడ్ లు కేటాయించలేదని.. ట్రీట్ మెంట్ కూడా మొదలు పెట్టకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీ ఆగడాలు సాగవని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో వారికి మెరుగైన చికిత్స చేయాలని సూచించారు.

వీరివెంట కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాష్, ఉప్పరి రవి, గందె మాధవి, మహేశ్, నాగిశేఖర్, జుబేర్, మూల జైపాల్, ముస్తాక్, బకారపు శివయ్య, నిహాల్, వేల్పుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *