
మిడ్ మానేరు సక్సెస్ స్టోరీ.
25 గేట్ల బిగింపు పూర్తి.
25 టిఎంసి ల నిల్వకు రెడీ.
డ్యాం పై స్పిల్ వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి.
నెలల్లో 50 శాతం పనుల పూర్తి
మొత్తం 2150 కోట్లు ఖర్చు.
ఇంజనీర్లను అభినందించిన మంత్రి హరీశ్ రావు.
మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం ఒక విజయగాథ. తెలంగాణ పునర్నిర్మాణంలోఇది కీలకం. ఈ ప్రాజెక్టును 2006లో ప్రారంభించగా 10 ఏళ్లలో 50 శాతం మాత్రమే పూర్తైతే, మిగతా 50 శాతం పనులు 10 నెలల్లో పూర్తి చేసి రికార్డులను ప్రభుత్వం తిరగరాసింది. మిడ్ మానేరు ప్రాజెక్టు గేట్ల బిగింపు సహా అన్ని సివిల్, మెకానికల్, సాంకేతిక పనులన్నీ బుధవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. కాళేశ్వరం పనులు అత్యంత వేగంగా సాగుతున్నందున శ్రీరాం సాగర్ కు గుండెకాయ అయిన మిడ్ మానేరు కీలకమని ప్రభుత్వం భావిస్తున్నది.మిడ్ మానేరు స్పీల్ వే పనులు కూడా పూర్తయ్యాయి. 10.50 కిలోమీటర్ల రివిట్ మెంటు పనుల్లో 10 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి.మొత్తం 25 గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు, బిగింపు పనులు పూర్తి కావడం పట్ల ఇరిగేషన్ మంత్రి హర్షం వెలిబుచ్చారు. ప్రాజెక్టు కు చెందిన సివిల్,మెకానికల్ పనులతో సహా భూసేకరణ, నిర్వాసితుల నష్టపరిహారం, పునరావాస చర్యల కోసం మొత్తం 2150 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.మిడ్ మానేరు ప్రాజెక్టులో మొత్తం కాంక్రీట్ పని 4.8 లక్షల క్యూబిక్ మీటర్లు కాగా, 10 ఏళ్లలో 65,200 క్యూబిక్ మీటర్ల పని మాత్రమే జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో బ్యాలెన్స్ క్యూబిక్ మీటర్ల పనులను తెలంగాణా ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం మొదట్లో రూ.639 కోట్లు.ఉమ్మడి రాష్ట్రంలో దీనిపై కేవలం రూ.107 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మిడ్ మానేరుపై మిగతా 2050 కోట్లకు పైగా ఖర్చు చేశారు.ప్రాజెక్టు పరిధిలోని ఆర్అండ్ఆర్ పనులను వేగంగా పూర్తి కావడానికి కృషి చేసిన ఇంజనీర్లను మంత్రి హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో అభినందించారు.10ఏళ్లలో చేయని పనిని 10 నెలల్లో చేసినందుకు సిబ్బందిని అభినందించారు. నిర్వాసితులకు శరవేగంగా పరిహారాన్ని అందించారు. పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాలని చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో 12 గ్రామాలకు చెందిన నిరాశ్రయులైన కుటుంబాల ఇంకా పెండింగులో ఉన్న 50 కోట్ల పరిహారం చెల్లింపులు వేగంగా జరిగేలా చూడాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.13 కాలనీల్లో సౌకర్యాలను ఆర్అండ్ఆర్ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేశారు. ఈ ఖరీ్‌ఫలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పంప్‌హౌజ్‌లు, రిజర్వాయర్ల పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ అధికారులకు మంత్రి నిర్దేశించారు. ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపడంపై మైనర్ ఇరిగేషన్ అధికారులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి కోరారు.సాగునీటి ప్రాజెక్టులంటే దశాబ్దాల కాలయాపన అనే ఆనవాయితీని తెలంగాణ ప్రభుత్వం తిరగరాసింది . కేసీఆర్ ప్రభుత్వం 50శాతం పనులను మూడేండ్లలోనే పూర్తి చెయడం ఒక రికార్డు. ఇరిగేషన్ అధికారయంత్రాంగాన్ని , ఏజన్సీలను పరుగులు పెట్టించడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి. మిడ్ మానేరు నుంచి మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు త్వరలోనే సాగునీరు అందించే ప్రక్రియను చేపడుతున్నారు.