మా రిపోర్టర్ పై దాడులు చేస్తారట.. రక్షణ కల్పించండి

madavi-tata

హైదరాబాద్ లోని ఔట్ లుక్ రిపోర్టర్ దాడులకు దిగుతామని చాలామంది ఈమెయిల్స్, ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా తమను హెచ్చరిస్తున్నారని.. హైదరాబాద్ లోని మా అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాకు రక్షణ కల్పించాలని ఔట్ లుక్ ఎడిటర్ కృష్ణ ప్రసాద్ తెలంగాణ డీజీపికి లేఖ రాశారు.

కాగా ఐఏఎస్ , తెలంగాణ సీఎంవో అడిషనల్ సెక్రటరీ స్మిత సభర్వాల్ పై ఔట్ లుక్ హైదరాబాద్ విలేకరి మాధవి అసభ్యకరంగా వార్త రాయడం వివాదం చెలరేగింది. దీంతో ఆమెపై తెలంగాణ అధికారులు, కొందరు అభిమానులు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. అందుకే రక్షణ కల్పించాలని ఔట్ లుక్ యాజమాన్యం తెలంగాణ పోలీస్ బాస్ కు లేఖ రాసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *