Breaking News

మా టీవీ అంత రేటుకు అమ్ముడుపోయిందా?

star-maa-takeover-pr-pic-02

హైదరాబాద్, ప్రతినిధి : ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్.., హీరోలు నాగార్జున, చిరంజీవిలు వాటాదారులుగా ఉన్న తెలుగు మా టీవీ కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అమ్ముడుపోయిందట.. నిన్న హైదరాబాద్ లో జరిగిన డీల్ లో స్టార్ గ్రూప్ యాజమాన్యం మా టీవీలోని వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.. అయితే మార్కెట్ రేట్ ప్రకారం ఎంత మొత్తం వెచ్చించారనేది విలేకరులు ప్రశ్నించగా మీడియా సమావేశంలో ఎవరూ స్పదించలేదు. కానీ దీని రేట్ ఆఫ్ ద రికార్డ్ గా రూ.2500 కోట్లకు ఒప్పందం కుదిరిందని టాక్..

తెలుగు టెలివిజన్ రంగంలో మాటీవీ 4 చానాళ్లను నిర్వహిస్తోంది. మొదట్లో జెమినీ టీవీ హవా ఉన్న క్రమక్రమంగా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పెరిగి ప్రస్తుతం నెంబర్ 1 చానల్ గా కొనసాగుతోంది.. మా టీవీలో నిమ్మగడ్డ ప్రసాద్ కు 60శాతం వాటా, నాగార్జున, చిరంజీవిలకు 20శాతం వాటా చొప్పున ఉన్నాయి. మాటీవీ పెట్టుబడికి కూడా చాలా తక్కువ మొత్తం అయ్యిందట.. కానీ ఇప్పుడు స్టార్ టీవీకి మాత్రం భారీ రేటుకు అమ్మి లాభాలు గడించారు.. తెలుగు మార్కెట్ విస్తృతంగా ఉండడం.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు స్టార్ గ్రూప్ ప్రయత్నించడంతో మాటీవీ యజమానులు దాన్ని అమ్మి భారీగా లాభపడ్డారు.

కాగా సంవత్సరం క్రితం రిలయన్స్ సంస్థ దేశవ్యాప్తంగా ఈటీవీ న్యూస్ చానాళ్లను రూ.2053 కోట్లకు కొనుగోలు చేసింది. దాదాపు 12 భాషా చానాళ్లకు గాను రెండు వేల వెచ్చించగా.. కేవలం తెలుగులో ఉన్న మాటీవీకే ఇంత ధర పలకడం మార్కెట్ వర్గాల్ని విస్మయ పరిచింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *