‘మా’ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ కు షాక్

rajendra-prasad-in-elections-contest

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా పోటీపడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ప్యానెల్ తరఫున శివాజీరాజా, ఉత్తేజ్ హఠాత్తుగా బుధవారం పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో జయసుధతో అధ్యక్ష స్తానంలోకోసం పోటీపడుతున్న రాజేంద్రప్రసాద్ ఒంటరి అయ్యారు. ఆయన కు చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రమే మద్దతు ఇస్తున్నారు.

ఈ నెల 29న మా అధ్యక్ష ఎన్నికలు జరుగునున్నాయి. మురళీ మోహన్ మద్దతుతో పోటీచేస్తున్న జయసుధకు ఈ సారి గెలుపు లాంఛనమే..

కాగా తాము ఎన్నికల బరిలోంచి ఎవరి ఒత్తిడి వల్ల తప్పుకోలేదని.. కేవలం తమ వ్యక్తిగత కారణాల వల్లే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు నటులు ఉత్తేజ్, శివాజీరాజా తెలిపారు. ఈ విషయం రాజేంద్ర ప్రసాద్ కు సైతం తెలిపామని వారు పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *