‘మా’ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ఘనవిజయం

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించారు.  87 ఓట్ల ఆధిక్యంతో జయసుధపై విజయం సాధించారు. మొత్తం ఏడు రౌండ్ల పాటు జరిగిన ఈ ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్ లో రాజేంద్రప్రసాద్ ఆదిక్యంలో కొనసాగారు.

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో చివరకు నటికిరీటి రాజేంద్రప్రసాద్ కే విజయం వరించింది. జయసుధ తరఫున నటుడు నరేశ్ ఎన్నికల కౌంటింగ్ కు హాజరయ్యారు. కాగా రాజేంద్రప్రసాద్ ప్యానెల్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసిన శివాజీరాజాతో పాటు మరో ఇద్దరు కూడా విజయం సాధించారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ తో పాటు ఆయన ప్యానెల్ ఘనవిజయం సాధించింది. మా ఫిలిం చాంబర్ బయట రాజేంద్రప్రసాద్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.టపాసులు,, డప్పులతో హంగామా చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *