మా ‘అర’ అన్నింట్లోనూ ముందే..

‘బావ కళ్లల్లో ఆనందం కోసం మర్డర్ చేశాడు మొద్దు శ్రీను’. కానీ ఉద్యోగుల కళ్లలో ఆనందం చూసే యజమానులు ఎంతమంది..? అసలు ఉద్యోగులకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది. వారిని ఎలా సంతృప్తి పరచాలి.. వీటికి పుస్తకాలు వెతకాల్సిన పనిలేదు.. గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలతో పోల్చి చూడాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా పరిస్థితులను అర్థం చేసుకోవడం.. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల కష్టనష్టాలు తెలియడం.. వారి అవసరాలు తీర్చడం.. ఉద్యోగుల నుంచి పనిని రాబట్టుకోవడం.. మరి సూటిగా చెప్పాలంటే .. వారి ఆర్థిక అవసరాలు తీర్చడం.. మా బాసు ‘అర’ ఇందులో అన్నింటికి అర్హుడు..

నిజం.. ప్రతీ నెల 1కి జీతం వచ్చే ఉద్యోగులకు 30నే ఇచ్చి చూడండి.. ఆ ఉద్యోగి కళ్లలో ఎంత సంతోషం చూస్తాం.. మరికొంత సమయం ఎక్కువే సంస్థ కోసం చేయాలనే తపన , కృషి కనపడుతుంది.. ఆ ఒక్క సీక్రెట్ చాలు మనం స్థాపించిన సంస్థ అయినా.. కంపెనీ అయినా ముందుకు దూసుకుపోవడానికి.. పరిగెత్తించడానికి.. ‘Man powar is the main thing in the world’ ఈ సూత్రం తెలుసు కాబట్టే మా బాసు ‘అర’ అంత పెద్ద సైటు అవలీల గా నడిపేస్తున్నాడు. కావాల్సింది కోట్లకు కోట్లకు పెట్టుబడులు కావు.. డబ్బులు లేకున్నా.. నమ్మకమైన ఉద్యోగులు ఉంటే చాలు.. రేటింగ్.. పేరు ప్రఖ్యాతలు వాటంతట అవే వస్తాయి. వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు మా బాసు ‘అర’

నేటి యువత ఎవరిని కదిలించినా అయితే ‘గూగుల్’, లేదంటే ఫేస్ బుక్ జాబ్స్ సంపాదిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా రాణిస్తున్నారు. మరి వాటినే ఎందుకు కోరుకుంటున్నారో.. అంటే గూగుల్ లో పనిచేసినట్టు ఉండదట.. ఒక పిక్నిక్ కు వెళ్లినట్టే ఉంటుందట.. చుట్టంతా గార్డెన్ లో ల్యాప్ టాప్ పట్టుకుని ఎక్కడైనా కూర్చొని పనిచేయి. ఒత్తిడి ఉండదు.. టీ, కాఫీ కేఫ్ లో ప్రెండ్స్ తో ముచ్చట్లతో మునిగితేలుతూ పనిచేయి అసలు ఒత్తిడే ఉండదు. సంస్థ కోసం 8 గంటల్లో 2 గంటలు వినోద కార్యక్రమాల కోసం గూగుల్ లో వెచ్చిస్తారట.. అలా ఫ్రీడంగా ఉంచుతేనే మంచి ఆలోచనలు వచ్చి సంస్థ పురోభివృద్ధి చెందుతుందని వారి విశ్వాసం..

అందుకే గూగుల్ ఆదర్శంగా ముందుకెళ్తున్న మా బాసు మాకు అదే ఫ్రీడం , సలహాలు సూచనలు , అవసరాలు తీరుస్తూ సంస్థ పురోభివృద్ధి కి కృషిచేస్తున్నారు.. కిందినుంచి వచ్చిన వారు.. పైగా ‘30 years journlist’కదా.. అందుకే.. ఆయన పనితనం, వేగం, చాతుర్యం ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *