
రైతు ఆత్మహత్యల నివారణ, ఆదుకోవడంపై టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముందుకొచ్చింది.. తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవడం.. ప్రభుత్వం కనీసం పట్టించుకుంట లేదన్న అపవాదు జనంలోకి బాగా వెళుతతోంది.. కేసీఆర్ మాత్రం టూర్ల అంటూ చైనా వెళ్లాడు. ఉన్నప్పుడు కూడా రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ పట్టించుకోవడం లేదు.. దీంతో విమర్శల జాడివానకు తెలంగాణ ప్రభుత్వం తడిసి ముద్దవుతోంది..
అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పట్టని పనిని కేసీఆర్ కుమార్తె కవిత నెత్తిన ఎత్తుకుంది. నిన్న కోదండరాం.. తెలంగాణ ప్రజాసంఘాలు, అఖిలపక్షం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసింది.. రైతులను ఆదుకునేందుకు ఎన్ ఆర్ ఐ , టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు , అన్ని పార్టీల వారు ముందుకు రావాలని.. మనిషి కొక రైతు కుటుంబాన్ని దత్తత తీసుకొని వారి పిల్లల్ని చదివించాలని తీర్మానం చేసింది.. దీనికి అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారు.
కాగా ప్రభుత్వం కేసీఆర్ చేయాల్సిన పనిని కవిత చేస్తోందంటూ ప్రతిపక్షాలు సెటైర్ వేశాయి..