
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తెలుగు సినీ ఇండస్ట్రీలో కీలకమైన పదవి. అటువంటి పదవి ప్రతీసారి ఏకగ్రీవంగానే జరుగుతోంది. కానీ ఈసారి మాత్రం పోటీ అనివార్యమైంది. ఈ అధ్యక్ష పదవికి నటులు రాజేంద్రప్రసాద్, జయసుధలు పోటీ పడుతున్నారు. 29న ఓటింగ్ జరుగనుంది.
ఆదినుంచి రాజేంద్రప్రసాద్ మా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపారు. ఆయనకు తెలుగు సినీ పెద్దలందరూ మద్దతు తెలిపారు. కానీ చివరకు వచ్చే సరికి ప్రస్తుత మా అధ్యక్షుడు మురళీ మోహన్ అనూహ్యంగా జయసుధకు మద్దతిచ్చి అమెను బరిలో దింపారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నిక నేపథ్యంలో తెలుగు సినీ పెద్దలు రెండు వర్గాలుగా విడిపోయారు. చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ వర్గం రాజేంద్రప్రసాద్ కు మద్దతు తెలిపింది. నాగబాబు స్వయంగా రాజేంద్రప్రసాద్ తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు. కాగా మురళీ మోహన్ జయసుధ తరఫున లాబీయింగ్ చేస్తున్నారు.
కాగా మాలో మిగితా పోస్టులకు మాత్రం ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మా ఉపాధ్యక్ష పదవులకు శివకృష్ణ, మంచులక్ష్మీ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనికెళ్ల భరిణి, ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా, కార్యదర్శిగా అలీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.