మాస్ మహరాజ్ ‘బెంగాల్ టైగర్’

హైదరాబాద్, ప్రతినిధి : రవితేజ కొత్త చిత్రం మాస్ మహరాజ్ స్టార్ట్ అయ్యింది. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నిన్న మొదలుపెట్టారు. ఈ చిత్రానికి బెంగాల్ టైగర్ అనే పేరు పెట్టారు. రవితేజలోని పూర్తి ఎనర్జీని వాడుకుంటానని సంపత్ నంది తెలిపారు. రవితేజ నుంచి ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని డైరెక్టర్ తెలిపారు. తమన్నా, రాశీ కన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సత్యసాయి బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మూహూర్తపు సీన్ కు వివి వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. మార్చి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని.. సెప్టెంబర్ లో మూవీని రిలీజ్ చేస్తామని నిర్మాత రాధామోహన్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *