Breaking News

మార్చి 6న వస్తున్న NH-10 మూవీ

ముంబై, ప్రతినిధి : అనుష్కశర్మ , నీల్ భూపాలన్ ప్రధాన పాత్రధారులుగా వస్తున్న చిత్రం NH-10. థ్రిల్లింగ్ కథతో ఆద్యంతం ఉత్కంఠ సస్పెన్స్ మేళవించిన ఈ సినిమా మార్చి 6న దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. నవదీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పాంథోమ్ ఫిలిం బ్యానర్ పై విక్రమాధిత్య మోటవానే, అనురాగ్ కశ్యప్, వికాస్ బల్, అనుష్కశర్మ, సునీల్ లుల్లాలు , కృష్ణ లుల్లాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిర్బన్ చక్రబొర్తి.

కథ విషయానికి వస్తే ఒక యువజంట 403 కి.మీ దూరం ఉన్న నేషనల్ హైవే 10పై విహారానికి వెళ్తారు. వారికి ఎదురైన క్రిమినల్స్ నుంచి వీరు ఎలా తప్పించుకున్నారనేది కథాంశం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *