మార్చి 5న 700 థియేటర్లలో ‘సూర్య వర్సెస్ సూర్య’

నిఖిల్, త్రిద జంటగా నటించిన చిత్రం ‘సూర్య వర్సెస్ సూర్య’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు నిఖిల్ మాట్లాడుతూ ‘నేటితో ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టాం. ఇప్పటివరకు యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ అన్ని రకాల సినిమాలు చేశాను. అందమైన ప్రేమకథతో  ప్రేక్షకుల ముందుకురావటం మాత్రం ఇదే తొలిసారి. ప్రేమ, వినోదం, సెంటిమెంట్ అన్ని అంశాలు మిళితమైన చిత్రమిది. ఢిఫరెంట్ జోనర్‌లో సాగుతుంది. సత్యమహవీర్ గీతాలకు చక్కటి స్పందన లభిస్తోంది. మంచి సినిమాను ప్రేక్షకులకు అందివ్వబోతున్నాం.  ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ చిత్రాలకు మించి ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది. హోలీ రోజున విడుదల కానుండటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సూర్యుడికి, సూర్య అనే యువకుడికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర ఇతివృత్తం’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘కొబ్బరికాయ కొట్టే రోజు యూనిట్ సభ్యుల్లో ఎలాంటి ఉత్సాహం కనిపించిందో గుమ్మడికాయ కొట్టే రోజు అలాంటి ఆనందమే కనపడుతుంది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరు ఈ సినిమా నాది అనే భావనతో కుటుంబ సభ్యుల్లా  కష్టపడి పనిచేశారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అనుకున్న దానికన్నా వంద రెట్లు అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆడియోతో పాటు ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. నిఖిల్ జీవితంలో మరిచిపోలేని చిత్రమిది. ఆయన కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 700 వందల థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా తెరకెక్కించిన ఈ చిత్రం కార్తికేయ స్థాయిలోనే పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని రచయిత చందుమొండేటి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైవా హర్హ, వాసు, సత్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *