మార్చి 15న ఆడియో విడుద‌ల‌వుతున్న ‘s/o స‌త్య‌మూర్తి’..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘ s/o స‌త్య‌మూర్తి’ టైటిల్ ఖ‌రారు చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,రావ్ రమేష్ నటిస్తున్నారు. ఇటీవ‌లే స్పైయిన్ లొ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సమంత‌, నిత్యామీన‌న్ ల పై మూడు పాట‌లు చిత్రీక‌రించి మార్చి 6న యూనిట్ అంతా తిరిగి వ‌చ్చారు. మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ అందించిన ఆడియో మార్చి 15న విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రానికి ‘s/o స‌త్య‌మూర్తి’  అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము.  ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా ఇంత‌మంది స్టార్స్ తో క‌ల‌ర్‌ఫుల్ గా వుంటుంది. ఇటీవ‌లే స్పైయిన్ లొ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సమంత‌, నిత్యామీన‌న్ ల పై మూడు పాట‌లు చిత్రీక‌రించి మార్చి 6న యూనిట్ అంతా తిరిగి వ‌చ్చారు. మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ అందిచిన ఆడియో ఈనెల 15 న విడుద‌ల చేస్తున్నాము. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి మా చిత్రం యూనిట్ త‌రుపున హొళి శుభాకాంక్ష‌లు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము.. అని అన్నారు.

నటీనటులు
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *