మార్చి 1 నుంచి బీడీకార్మికులకు వెయ్యి పింఛన్

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణలోని బీడీ కార్మికులకు నెలకు వెయ్యి పించన్ భృతిని మార్చి 1నుంచి అందించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అధికారుల సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. బీడీ కార్మికుల పింఛన్ పథకాన్ని తానే స్వయంగా కరీంనగర్ జిల్లా మెట్ పల్లి, మెదక్ జిల్లా దుబ్బాక, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలలో ప్రారంభిస్తానని చెప్పారు. మిగితా జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. బీడీ కార్మికులున్న జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. బీడీ కార్మికుల భృతి కోసం సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ.40 కోట్ల రూపాయలు విడుల చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *