మార్చి ప్రథమార్ధంలో ‘డా. సలీమ్’

Aksha-Pardasany-at-Dr.-Saleem-Movie-Stills-5

విజయ్ ఆంటోని, అక్ష జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డా. సలీమ్’.నాగప్రసాద్ సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ మరియు ఓబులేశ్వరప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చిత్రకథానాయకుడు విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోందని సురేష్ కొండేటి అన్నారు.మార్చి ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని కూడా చెప్పారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సురేష్ కొండేటి మాట్లాడుతూ – “వైద్యంపేరుతో జనాలను దోచుకోవడం నేడు కొన్ని ఆస్పత్రులకు ఆనవాయితీఅయ్యింది. కానీ, సలీమ్ అలాంటి డాక్టర్ కాదు. రోగులకు ప్రాణాలు పోయడం మాత్రమే కాదు.. తన కళ్ల ముందు ఎలాంటి అన్యాయం జరిగినా ఎదిరిస్తాడు. బడాబాబుల చేతిలో మోసపోయిన ఓ అనాథ పిల్లను కాపాడి, వైద్యం చేసేసలీమ్ ఆ అమ్మాయి అసలు కథ తెలుసుకుంటాడు. ఆ అమ్మాయికి అన్యాయం చేసినవాళ్లను అంతం చేయడానికి సలీమ్ ఏం చేశాడు? అనేఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. సంగీతదర్శకుడుగా మంచిగుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని ఈ చిత్రంలో సలీమ్ పాత్రనుఅద్భుతంగా చేశారు. మా ఎస్.కె. పిక్చర్స్ నుంచి ఇప్పటివరకు ప్రేక్షకాదరణపొందిన చిత్రాలే వచ్చాయి. ఈ చిత్రం కూడా ఆ కోవలో చేరే విధంగాఉంటుంది. కమర్షియల్ అంశాలు మెండుగా ఉన్న మంచి కథతో దర్శకుడునిర్మల్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించారు” అని చెప్పారు.

మరో నిర్మాత తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ – ”ఈ మధ్యకాలంలోఇలాంటి సినిమా రాలేదు. అన్ని వర్గాలవారు చూడదగ్గ విధంగా చిత్రంఉంటుంది. ఈ వేసవికి మంచి ఎంటర్ టైనర్ అవుతుంది” అన్నారు.

ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్. దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్కుమార్. సంగీతం: విజయ్ ఆంటోని

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *