Breaking News

మార్చిలోగా భూపంపిణీ పూర్తి చేయాలి

dial-your-colectr

-కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్
కరీంనగర్, ప్రతినిధి : జిల్లాలో దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫోన్ కాల్స్ కు సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా గంగాధర మండలం నుంచి కవిత ఫోన్ ద్వారా మాట్లాడుతూ దళితులకు మూడు ఎరకాల భూ పంపిణీ చేస్తామని ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదని కలెక్టర్ గారూ వెంటనే స్పందించి దళితులకు భూ పంపిణీ కోరారు. దీనికి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18 కోట్ల రూపాయలున్నాయని వెంటనే లబ్ధిదారులను గుర్తించి బూమిని కొనుగోలు చేసి మార్చిలోగా భూ పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇలా వచ్చిన 15 టెలిఫోన్ కాల్ సమస్యలను పరిష్కరించారు.

అధికారులు ఫోన్ చేసిన ప్రజల సమస్యలను రిపోర్టు తీసుకొని వెంటనే అతడికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. డయల్ యువర్ కలెక్టర్ సమస్యలకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

prajavani

అంతకుముందు  ఆయన ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు స్వీకరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *