డేరింగ్ ‘సర్దార్’.. డాషింగ్ నిర్ణయం

కరీంనగర్,ప్రతినిధి : కరీంనగర్ లోని ప్రధాన కూరగాయల మార్కెట్ ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతూనే ఉంటుంది. చోటామోటా కూరగాయలు అమ్మే రైతులు, మారు వ్యాపారులు రోడ్లపైనే పెట్టుకుని కూరగాయలు అమ్ముతుంటారు. దీంతో అటు నుంచి వెళ్లాలనుకునే వారికి నరకం కనిపించేది. దీన్ని పరిష్కరించాలని భావించిన నాటి పాలకులకు రాజకీయ ఒత్తిళ్లతో అది సాధ్యం కాలేదు..

market 03

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాం.. కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు. దీంతో ఓ పార్టీతో పొత్తుతో చైర్మన్ గిరీ నడిచింది. డిప్యూటీ మేయర్ గా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనసాగారు. అప్పట్లోనే రోడ్డుమీదున్న కూరగాయల వ్యాపారులను మార్కెట్లో స్థలం చూపించి వారిని రోడ్డు మీదనుంచి తరలించాలని యోచించినా అది సాధ్యం కాలేదు. లోపల చాలా మంది ఓ వర్గం వారు, కొంతమంది ఇతర వ్యక్తులు ప్రభుత్వ స్థలం కబ్జా చేసి ఏళ్లుగా ప్రభుత్వానికి ఫీజు కట్టకుండా కబ్జా చేశారు.

market 03.jpg04

కాగా అప్పటి కాంగ్రెస్ హయాంలో మార్కెట్ లోపల స్థలం ఆక్రమించిన వారిని వెళ్లగొట్టాలని భావించారు. కానీ అప్పుడు కార్పొరేషన్ లో రెండో అతిపెద్ద పార్టీ గా ఉన్నవారు, డిప్యూటీ మేయర్ రాజకీయ ఒత్తిడితో ప్రధాన కూరగాయాల మార్కెట్ ను తరలించేందుకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు సాహసించలేదు..

కానీ ఇప్పుడు టీఆర్ఎస్ సింగిల్ గా కరీంనగర్ కార్పొరేషన్ పై జెండా ఎగురవేసింది. ఆ సమయంలో వ్యతిరేకించిన పార్టీ ఆరు సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా పొందలేదు. సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ మేయర్ గా సర్వసత్తాకంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల మద్దతుతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా రోడ్ల నుంచి, తాగునీటి పైపులు, కూరగాయల మార్కెట్ వరకు అన్నింటిని ప్రక్షాళన చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోని తప్పులను సరిచేస్తున్నారు.

market

అదే ఊపులో బుధవారం ప్రధాన కూరగాయల మార్కెట్ ను పోలీసుల సహాయంతో కూలగొట్టించేశారు మేయర్ రవీందర్ సింగ్.. ఎన్ని ప్రభుత్వాలు మారినా సాధ్యం కానిది ఎలాంటి గొడవ లేకుండా చేసి చూపించారు. కొందరు దళారుల ఆక్రమణల్లో మగ్గిపోతున్న కరీంనగర్ లోనే అత్యంత విలువైన, కోట్ల విలువ చేసే స్థలాన్ని కూలగొట్టించేశాడు. ఆ దళారి వ్యాపారులను అక్కడి నుంచి పోలీసుల సహాయంతో వెళ్లగొట్టించారు. నగరంలో నడిబొడ్డున ఈ ఆక్రమణ భూమిలో ప్రధానంగా ఓ వర్గం నాయకులు, కొందరు కబ్జాకోరులు స్థలాన్ని కబ్జా చేసి కార్పొరేషన్ కు ఫీజు కట్టకుండా కూరగాయలు, కోళ్లు, ఇతర నిత్యావసరాలు అమ్ముతూ లక్షలు గడిస్తున్నారు. ఇన్నాళ్లు ఓ పార్టీ అండతో వీళ్లు తమపై ఈగవాలకుండా చేసుకున్నారు.

కానీ టీఆర్ఎస్ కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం, సర్దార్ రవీందర్ సింగ్ మేయర్ పీఠమెక్కడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. దీంతో మేయర్ కబ్జా కోరుల నుంచి మార్కెట్ స్థలాన్ని విడిపించారు. రైతులు, కూరగాయల వ్యాపారులను సైతం రోడ్డుపైన అమ్మకుండా చేశారు.

కూలగొట్టిన స్థలంలో చదును చేసి.. అందిరికీ జాగా చూపించి మార్కెట్ లో సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక పై రోడ్డుపై ఎవరూ అమ్మకుండా మార్కెట్ లో అందరికీ స్థలాలు సమకూర్చి మార్కెట్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఎంతైనా సర్దార్ రవీందర్ ఇంత డేరింగ్ గా కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుండడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగ్ ఈజ్ కింగ్ అంటూ నినదిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *