
కోడి పెడితే అది గుడ్డవుతుంది. కానీ చైనా వారు కృత్రిమంగా కోడిగుడ్లు తయారు చేస్తూ మార్కెట్‌లోకి వదులుతున్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం వాటిని అడ్డుకోవడంలేదు. కేరళ మార్కెట్‌లో కనిపించిన చైనా గుడ్లు కలకలం రేపుతున్నాయి. చైనా గుడ్లను కోళ్లు పెట్టవు. వాటిని కంపెనీలో కెమికల్స్ వాడి తయారు చేస్తారు. ఇవి మరీ తెల్లగా ఉండవు. గోధుమ రంగులో ఉంటాయి. గుడ్లు లోపల ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. పైన ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ గుడ్లను సూపర్ మార్కెట్‌లోకూడా అమ్ముతున్నారు. మామూలు గుడ్డు కన్నా ఇది గట్టిగా ఉంటుంది. నీటిలో వేసి ఉడకబెడితే బాగా ఉబ్బి..రబ్బరు బాల్‌లా తయారవుతుంది. దీని రుచి సాధారణ గుడ్డులా ఉండదు. ఈ గుడ్డుపై ఈగలు, దోమలు వాలవు. ఎన్ని నెలలైనా గుడ్డు చెడిపోదు. ఇలాంటి గుడ్లు తమిళనాడు మీదుగా తమ రాష్ట్రానికి వస్తున్నాయని కేరళ వాసులు ఆరోపిస్తున్నారు. అందుకే గుడ్లు కొనేటప్పడు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. చైనా కోడిగడ్లపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గతంలో కేరళలో ప్లాస్టిక్ రైస్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.