మార్కులు తక్కువ వస్తే అంత పనిచేస్తావా.?

తిరుపతి : మార్కులు తక్కువచ్చాయని .. తోటి విద్యార్థుల ముందు తలెత్తుకు తిరగలేకపోతున్నానంటూ ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ తుమ్మ చెట్లపల్లెకు చెందిన సి. సురేంద్ర, ఈశ్వరమ్మల మొదటి కుమార్తె కల్యాణి (15) అంగళ్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. రోజు మాదిరిగా స్కూలు కెళ్లినా త్రైమాసిక ఫలితాలలో అందరికంటే తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో చిన్న బుచ్చుకున్న కల్యాణి తీవ్ర మనోవేదనతో సూసైడ్ నోట్ రాసి తమ్మనగుట్ట రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది.

స్థానికులు ఆమెను 108లో తిరుపతికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *