మారుతి స్పోర్ట్ కారు ‘విటెరా బ్రెజ్జా’

 మారుతి సుజుకి కొత్త కారు ‘విటెరా బ్రెజ్జా’ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఎస్.యూ.వీ స్పోర్ట్ కారును ఫోర్డ్, రెనాల్ట్ విడుదల చేసిన ఎకోస్పోర్ట్, డస్టర్ లకు పోటీగా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. స్పోర్ట్ కేటగిరిలో వెనుకబడి న మారుతి ఈ విటెరా బ్రెజ్జాతో ఆ లోటును పూడ్చుకుంది. ఇప్పటికే దేశంలో మారుతి కార్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది.  సాధారణ, మధ్యతరగతి ప్రజలు సైతం కొనే ధరలో విడుదల చేసిన చిన్న కారు మారుతి ఆల్టో విడుదలైన తరువాత నేటికి దాదాపు 30,00,000 విక్రయించి దేశంలోనే అత్యధిక కార్లను అమ్మిన కంపెనీగా అవతరించింది.

కాగా కార్ల పోటీ దృష్టి చాలా కంపెనీలు ఇప్పుడు మారుతికి పోటీగా వచ్చాయి.. ప్రస్తుతం ఫోర్డ్, టయోటా, హుండాయ్, రెనాల్ట్ కార్లు మారుతికి గట్టిపోటీనిస్తున్నాయి. ఆల్టోకు పోటీగా రెనాల్ట్ విడుదల చేసిన ‘రెనాల్ట్ క్విడ్’ కారు మారుతి కంటే తక్కువ రేటులో 3.80-4.50 లక్షలకే లభ్యమవుతోంది. ఇది ఆల్టో కంటే చాలా మంచి డిజైన్, మైలేజ్, పికప్ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఇది అందరినీ ఆకర్షిస్తోంది. ఫోర్డ్ కార్లు సైతం బాగానే ఉన్న ధర ఎక్కువగా ఉంది. హుండాయ్ ఐ సిరీస్ లలో కూడా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇలా మారుతి 1వ స్థానంలో ఉన్న మిగతా కార్లకంపెనీల పోటీతో త్వరలో స్థానాలు మారే అవకాశాలున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *