మారిగోల్డ్ హోటల్ లో నాబార్డ్ నిర్వహించిన స్టేట్ క్రెడిట్ సెమినార్ కార్యక్రమానికి హాజరైన మంత్రులు

మారిగోల్డ్ హోటల్ లో  నాబార్డ్ నిర్వహించిన స్టేట్ క్రెడిట్ సెమినార్ కార్యక్రమానికి హాజరైన మంత్రులు ఈటల రాజేందర్,హరీష్ రావు. రైతులకు మరిన్ని రుణాలు అందించాలి. వారికీ ఋణం ఇవ్వడం అంటే దేశానికి సేవ చేయడం. వ్యాపారకోణంలో ఆలోచించవద్దు అని కోరిన ఆర్థిక మంత్రి ఈటల. 

లెక్కలు, జీడీపీ ల కోణం లో కాకుండా మానవీయకోణం లో పేదలకు రుణాలు ఇవ్వండి. 

పాడి  పంట కలగలిసి ఉన్న చోట రైతు ఆత్మహత్యలు లేవు. 

సంపద కేంద్రీకృతం అవ్వడం పేదరికానికి కారణం.. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల  రైతు రాజు కాబోతున్నాడని మంత్రి ఈటల అన్నారు. అందుకు అనుగుణంగా బ్యాంకులు మద్దతు ఇవ్వాలని అయన అన్నారు. గతంలో లాగ గ్రౌండ్ వాటర్ ని పెంచడాన్ని కి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నీటిపారుదల ప్రాజెక్ట్స్, మిషన్ కాకతీయ కార్యక్రమములతో తెలంగాణ లో ఉన్న అన్ని చెరువులు, కుంటలు, వాగుల్లో నీరు ఎప్పటికి ఉండేలా చూస్తున్నాం. ఇదో మానవ అద్భుతం అని ఈటల రాజేందర్ అన్నారు. కాబట్టి బావులు ఒర్లు తవ్వడానికి ఎక్కువ రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని మంత్రి బ్యాంకర్స్ తో అన్నారు. భారీ నీటిపారుదల  ప్రాజెక్ట్స్ నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోవడం వల్ల  అర్చనలు 300% పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈనాడు అనుకున్న దానికంటే  ముందే ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నామని తెలిపారు.

eatela rajender 2

దీనివల్ల రుణ భారంకూడా తగ్గించగలిగామన్నారు. తుపాకుల గూడెం, సుందిళ్ళ ,అన్నారం,మేడిగడ్డ లను మిడ్ మానేరుకు అనుసంధానం చేయడం ద్వారా 70% తెలంగాణ భూమికి నీళ్లు అందిస్తామని అన్నారు. గతంలో గోదాముల నిర్మాణానికి కూడా పెద్ద మొత్తం లో రుణాలు ఇచ్చేదని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే భారీ స్థాయిలో గోదాముల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రము లో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా ప్రస్తుతం 18 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను రెడీగా పెట్టినం. కాబట్టి వీటికోసం ఇచ్చే రుణాలు రైతులకు వేరే అవసరాలకోసం ఇవ్వాలని మంత్రి బ్యాంకర్స్ ని కోరారు. రైతులకు స్కేల్ అఫ్ ఫైనాన్స్ పెంచాలని విజ్ఞప్తి చేసారు. విద్యుత్ అందిచడం ద్వారా కాలిపోయే మోటార్ల ఖర్చుని రైతుకు ఆడ చేయగలిగామని అన్నారు. దేశంలో 24 గంటల  విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అని అన్నారు. దేశంలో సర్ప్లస్ పవర్ ఉందని, తక్కువ ధరకు దొరుకుతుందని  మిగతా పార్టీలు   చెప్తున్నాయి కదా .. అలాంటప్పుడు దేశం లో ఇతర రాష్ట్రాలు ఎందుకు ఉచిత విద్యుత్ అందిచడం లేదని ఈటల ప్రశ్నించారు.  రైతు వ్యాపారి కాదు అని , అయన వ్యాపారకోణంలో ఆలోచిస్తే మనం అన్నం ఉండదని  అన్నారు. రైతు చెమట ధారపోసి కష్టపడుతున్న అతనికి సాయం చేయడం అంటే దేశానికి సేవ చేయడం అని అన్నారు.అందుకే  8000 సంవత్సరానికి అందిచబోతున్నామన్నారు. మనలో చాల మంది రాజకీయనాయకులు , అధికారులు రైతు బిడ్డలమని చెప్పుకుంటున్నారు కానీ ఆ రైతుకు ఇప్పటివరకు ఒరిగింది ఏమి లేదు అన్నారు.

ఇప్పుడు చేపడుతున్న సమగ్ర చర్యల వల్ల  రైతు కుటుంబాల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి తెలిపారు. వ్యవసాయ అనుబంద రంగాలను అభివృద్ధిచేయాలని ప్రభుత్వం పని చేస్తుంది. అందుకే గొర్రెల మేకల పంపిణీ చేస్తున్నాం 4 వేల  కోట్ల రూపాయల సంపదను అందించాం ..  జయతి ఘోష్, రామచంద్ర రెడ్డి కమిషన్ లు ఇచ్చిన రిపోర్ట్స్ లో రైతు ఆత్మహత్యలు ఆగాలంటే పాడి-పంట కలిసి ఉండాలి అని చెప్పారు. అలా చేయడం వల్లనే చిత్తూర్ లో ఆత్మహత్యలు లేవని అన్నారు. GSDP కి వ్యవసాయానికి ముడిపెట్టి మాట్లాడవద్దని.. 17 % GSDP ఆయన 60 శాతం ప్రజల జీవితం వ్యవసాయం పై ఆధారపడి ఉందని అన్నారు. బ్యాంక్స్ మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో టార్గెట్స్ ఇంకా పూర్తి కావడం లేదు. ఎప్పుడు లెక్కల రూపంలో కాకుండా మానవతా కోణం లో చూసి అప్పు ఇవ్వండి. పేద గ్రామీణ మహిళలకోసం 1000 కోట్ల తో ప్రత్యేక రుణసదుపాయం కల్పించండి అని కోరారు. సంపద కొద్దీ మంది దగ్గర పోగు కావడం సమాజానికి మంచిది కాదు. ఇది మన రాజ్యాంగినికి కూడా విరుద్ధం అని మంత్రి అన్నారు. సంపద అందరి అవసరాలను తీర్చాలి.

eatela rajender 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *