మాయాకూటమిని నమ్మొద్దు

మాయాకూటమిని నమ్మొద్దు

-టీఆర్ఎస్ ను గెలిపించాలి
-పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే మాయాకూటమిని నమ్మొద్దని పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం సోమారం గ్రామం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతులు, కోలాటం, ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయా కూటమి మోసపూరిత మాటలు నమ్మవద్దన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. మరో మారు అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు పెంపు, రైతు బంధు రూ.10 వేలు, లక్ష రూపాయల రుణ మాఫీ, నిరుద్యోగ భృతి రూ.3వేలు అందజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి తెలంగాణ ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ చేసిన అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథ పడుతున్నారన్నారు. ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటానని తెలిపారు. అభివృద్ధి విషయంలో నియోజకవర్గాన్ని రాష్ట్ర్రంలోనే ముందంజలో నిలుపుతానన్నారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు. గ్రామాల్లో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానన్నారు. పాలకుర్తి ప్రజలు తనను రెండు సార్లు ఆదరించారని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. త్వరలో నిర్వహించనున్న కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అంతకుముందు సోమారం గ్రామం నుంచి కాంగ్రెస్ కు చెందిన ఐదు కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు. మాంద్యాల్ 4వ వార్డు మెంబర్, శ్రీకాంత్, కొమురయ్య, యకాంభ్రం తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్. సుధాకర్ రావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2    errabelli dayakar rao 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *