
హైదరాబాద్ శంషాబాద్ ఏయిర్ పోర్ట్ మాదకద్రవ్యాలకు అడ్డాగా మారింది.. డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.. ఇది ఎంతవరకు వెళ్లిందంటే ఒక సౌతాఫ్రికా మహిళను ఆశపెట్టి ఆమె కడుపులో కోటి రూపాయల డ్రగ్స్ ను పెట్టి కుట్టి శంషాబాద్ విమానా శ్రయం ద్వారా హైదరాబాద్ లో విక్రయించేందుకు ప్లాన్ తీశారు. ఆ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు..
ఆమెను ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ చేసి ఆమె కడుపులో దాచిన డ్రగ్స్ ను వెలికితీశారు. దాదాపు చాలా క్యాప్సుల్స్ రూపంలో వాటిని కడుపులో దాచారు. ఈరోజు మరో సారి స్కాన్ తీసి మరిన్ని డ్రగ్స్ ను తీసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.