మానవత్వం చాటుకున్న స్మిత సభర్వాల్

తెలంగాణ సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి, కరీంనగర్ మాజీ కలెక్టర్ స్మితా సభర్వాల్ మళ్లీ తన సేవాభావాన్ని చాటుకున్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో ఏడేళ్లుగా షుగర్ వ్యాధితో బాధపడుతన్న నిహారిక అనే బాలికను పరామర్శించారు. బాలిక స్మితను చూడాలని ఉందనే కోరిక మేరకు మేక్ ఏ విష్ అనే స్వచ్ఛంద సంస్థ స్మిత సభర్వాల్ ను సంప్రదించింది.

ఈ మేరకు స్మిత కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. బాలికను , ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివేందుకు తాను తోడ్పాటునందిస్తానని తెలిపారు. గతంలో కరీంనగర్ కలెక్టర్ గా ఆమె ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి కీర్తి పొందారు. మళ్లీ ఓ బాలిక కోసం తరలివచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *