మానవత్వం చాటావ్.. గొప్పొడివి సామీ..

00kcr pratyusha

మానవత్వం మంటకలిపిన ఓ తండ్రి, పిన్ని చేష్టలకు బక్కచిక్కిన ప్రత్యూష.. ఆస్పత్రి పాలై కోలుకుంది.. ఆమె చిత్రహింసలు చూసి కన్నీళ్లు కార్వని మనిషి లేడు.. ఇందులో సీఎం కేసీఆర్ ఉన్నాడు.. ఆమె గాథ విని స్వయంగా ఆస్పత్రికెళ్లి ప్రత్యూషకు మాట ఇచ్చాడు. ఆమె డిచ్చార్జి కాగానే ఇంటికి తీసుకొచ్చుకొని భోజనం పెట్టాడు. కష్టసుఖాలను తెలుసుకున్నాడు.. ఆమెకు 5 లక్షల సాయం ప్రకటించారు. మంచి హాస్టల్ లో పెట్టి చదివిస్తానన్నాడు.. చదువు కో బిడ్డా అని భరోసా నిచ్చాడు.. చదువు ఖర్చంతా తమదేనని ప్రకటించారు.

ప్రత్యూష భద్రతను పర్యవేక్షించాల్సిన సైబారాబాద్ కమిషనర్ ను ఆదేశించారు. మహిళ శిశు సంక్షేమ సంచాలకురాలు విజయేంద్ర కు సూచించారు.

కాగా సీఎం కేసీఆర్ ప్రత్యూషపై చూపిన అభిమానంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. మానవత్వం పరిమళించిన  మానవతావాది అంటూ సోషల్ మీడియా సైట్లలో హోరెత్తిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *