
సకల మానవాళి శ్రేయమే తన ఆశయముతో గొప్ప మానవతా శిఖరం గాంధీజీ అని, గాంధీజీ సూచించిన విశ్వ మానవతా వాదనను అంగీకరించి ఆచరిస్తే, సరిహద్దు గొడవలు- జాతి వైషమ్యాలు, మతకలహాలు కనుమరుగై ప్రపంచమే ఒక శాంతివనం- జగమంత శాంతి మయం అవుతుందని అడిషనల్ కలెక్టర్ జీ.వి. శ్యాంప్రసాద్ లాల్ పిలుపునిచ్చారు. గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో నెల రోజులపాటు జిల్లావ్యాప్తంగా గాంధీజీ సిద్ధాంతాల పట్ల యువత, విద్యార్థులకు అవగాహన కల్పించి, గాంధీ జయంతిని పురస్కరించుకుని వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు గాంధీ జయంతి రోజు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ లు బహుమతులు అందజేసే కార్యక్రమాన్ని సంబంధిత బ్రోచర్లు ,కరపత్రాలను డా:అశోక్ తో కలిసి క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు . గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ డా:అశోక్ పరికిపండ్ల మాట్లాడుతూ ఇప్పుడున్న యాంత్రిక ప్రపంచానికి గాంధీజీ సిద్ధాంతాలు తప్పనిసరిగా అవసరమని, ఆ క్రమంలో విద్యార్థులకు,యువకులకు గాంధీజీ సిద్ధాంతాల పట్ల అవగాహన సదస్సులు ,చర్చా గొస్తులు ఏర్పాటు చేసి, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గాంధీ జయంతి నాడు సర్టిఫికేట్లు అందజేయడం జరుగు తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత రేండ్ల కళింగ శేఖర్ ,పెద్దపల్లి జిల్లా సామాజికవేత్త వేముల రామ్మూర్తి, ఆడెపు స్వతంత్ర కుమార్, కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.