
తెలంగాణ శాసనసభలో మొదటిసారి జానారెడ్డి ఆగ్రహాన్ని చూశాం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మైక్ అందుకొని అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై విపక్షాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు.
దీనిపై జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి పాత్ర పోషించి తెలంగాణ అనే బిడ్డను కనిందని.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ప్రజల ఆకాంక్షలు తీర్చిందని.. కేవలం టీఆర్ఎస్ చేసింది మంత్రసాని పాత్ర అని స్పష్టం చేశారు. జానారెడ్డి సీరియస్ కావడంతో బాలకిషన్ క్షమాపణ చెప్పారు.