మాదిగ మహా యోగి దున్న ఇద్దాసు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎంపి కల్వకుంట్ల కవిత

తొలి తెలంగాణ దళిత కవి దున్న ఇద్దాసు తత్వాలు, సంకీర్తనలు అనుసరణీయమన్నారు నిజామాబాద్ IMG-20180505-WA0321IMG-20180505-WA0316IMG-20180505-WA0317ఎంపి కల్వకుంట్ల కవిత. అసమానతలు లేని సమాజం వైపు అడుగులు వేసేందుకు ఆయన తత్వాలు, సంకీర్తనలు సిడి రూపంలో తెలంగాణ జాగృతి తీసుకువస్తుందని తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో తెలంగాణ వికాస సమితి తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో మాదిగ మహా యోగి దున్న ఇద్దాసు పుస్తకాన్ని ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు,
సిఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో కవిత మాట్లాడుతూ పశువుల కాపరి అయిన ఇద్దాసు నిరక్షరాస్యుడయినప్పటికీ వేదాంత రహస్యాలను అలవోకగా, సులువుగా చెప్పారని అన్నారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదివి విశేషమైన తెలివితేటలను సంపాదించిన వారు సైతం మాయకు లో అయ్యారని ఇద్దాసు తన తత్వాల్లో పొందుపరచడం విశేషమన్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత ఇద్దాసు తత్వాల్లో కొన్నింటిని వినిపించారు. ఈ తరానికి అవరసరమయిన ఇన్ఫర్మేషన్, ఇన్స్పిరేషన్ రెండూ ఇద్దాసు తత్వాల్లో ఉన్నాయని తెలిపారు.

అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేటున్నదన్నారు.
ఉన్నత చదువుల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లిన ఎస్సీ,ఎస్టీ అమ్మాయిలకు ఇండ్లు కిరాయికి ఇవ్వని దయనీయ పరిస్థితి ని ఉద్యమ సమయంలో స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలను ప్రారంభించారు అని కవిత చెప్పారు. సాహితీవేత్తలు, కవులు, కళాకారులకు తగిన గుర్తింపు లేదని ఉద్యమం సమయంలో బాధ పడేవారమని, స్వరాష్ట్రంలో ఆ వర్గాలకు ప్రాధాన్యత నిస్తూ సముచిత రీతిలో గౌరవించు కుంటున్నమని ఎంపి కవిత వివరించారు. తెలంగాణ వికాస సమితి చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉంటామన్నారు.

ఈ కార్యక్రమంలో అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి, ప్రముఖ వాగ్గేయ కారుడు గోరటి వెంకన్న, తెలంగాణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆయాచితం శ్రీధర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కొలుకలూరి ఇనాక్, పుస్తక సంపాదకులు దున్న విశ్వనాథం, పరిశోధకులు సింగిసెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, భాస్కర యోగి పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *