Breaking News

మాటీవీలో 49% వాటా కొన్న స్టార్ గ్రూప్

maatv

తెలుగు టీవీ చానెల్ లో నెంబర్ 1గా కొనసాగుతున్న మాటీవీలో ‘స్టార్ ఇండియా గ్రూప్’ వాటా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ రెండు సంస్థల మధ్య బిజినెస్ ఒప్పందం కుదిరింది. 49 శాతం మాటీవీ షేర్స్ ని స్టార్ గ్రూప్ కొనేసింది.

ఈ సందర్భంగా స్టార్ గ్రూప్ సంస్థ ప్రతినిధి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ తెలుగులో ఇప్పటివరకు తమ ప్రసారాలు లేవని.. అందుకే మాటీవీతో టైఅప్ అయ్యామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మేనేజ్ మెంటే ఉంటుందని.. ప్రమోటర్స్ కూడా వాళ్లే ఉంటారని తెలిపారు. రెగ్యులేటర్ పర్మిషన్స్ రాగానే ఈ డీల్ అమల్లోకి వస్తుందని చెప్పారు. కాగా ఈ ఒప్పందానికి మాటీవీ సీఈవో నిమ్మగడ్డ ప్రసాద్, పార్టనర్స్ హీరోలు చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ లు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *