మాజీ లవర్ తో కరీనా రొమాన్స్ !

క్యూట్ బ్యూటీ కరీనా కపూర్ పెళ్లయిన తర్వాత కూడా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. అదే ఇమేజితో కొత్త హీరోయిన్లతో పోటీ పడుతోంది. సైఫ్ ను పెళ్లి చేసుకుని బేగం గా మారినా హాట్ సీన్లలో నటించడానికి మాత్రం మొహమాట పడటం లేదు. ఓ మోస్తరు ఎక్స్ పోజింగ్ తో గ్లామర్ హీరోయిన్ గానే చెలామణి అవుతోంది. ఒకప్పుడు షాహిద్ కపూర్ ను రేపో మాపో పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రేమ పెటాకులైంది. మధ్యలో సైఫ్ దూసుకు వచ్చి అమ్మడిని వలలో వేసి పెళ్లి చేసుకున్నాడు.

అయినా ఇప్పుడు షాహిద్ తో హాట్ రొమాన్స్ కు కరీనా రెడీ అయిందట. ఉడ్తీ పంజాబీ అనే సినిమాలో ఈ పాత ప్రేమ జంట జోడీగా నటిస్తోంది. అందులో తన మాజీ ప్రియుడితో కలిసి లవ్ సీన్స్  ను రక్తి కట్టించబోతోందట కరీనా. ఎంతైనా మాజీ బాయ్ ఫ్రెండ్ కాబట్టి ఇద్దరి మధ్యా కెమిస్ట్ర్రీ బాగానే పండుతుందని అంటున్నారు సినిమా యూనిట్ వారు. ఇద్దరూ లీనమై లవ్ సీన్లు చేస్తే ప్రేక్షకులకు నయనానందమే కదా.

అన్నట్టు… బాలీవుడ్ ఫ్రెష్ సెన్సేషన్ అలియా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తోందట. అందం కంటే అభినయంతో పాపులర్ అయిన అలియా, కరీనాల్లో ఎవరు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తారనేది బాలీవుడ్ జనాలకు ఆసక్తికరమైన విషయంగా మారింది. అలియా ముందు కరీనా నిలబడుతుందా, కరీనా గ్లామర్ ముందు అలియా పోటీ పడుతుందా అనే చర్చ ఆల్ రెడీ మొదలైందట.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.