Breaking News

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు హఠాన్మరణం

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు హఠాన్మరణం

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి ముద్దు కృష్ణమనాయుడు బుధవారం నాడు హఠాన్మరణం చెందారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లు తమ సంతాపం తెలిపారు. గాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మంత్రులు నారా లోకేష్,  కిమిడి కళా వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ టిడి జనార్ధన్ రావు, గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ ఎల్ విఎస్ ఆర్ కె ప్రసాద్ కార్యాలయ కార్యదర్శి ఎవి రమణ, ఎమ్మెల్సీ వివివి చౌదరి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ ఫ్రొఫెసర్ వి జైరామిరెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర్ర అధ్యక్షులు ఎల్ రమణ తదితరులు తమ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *