
హైదరాబాద్ లో గొలుసు దొంగల బీభత్సం కొనసాగింది.. ఒంటరి మహిళలే లక్ష్యంగా దాడులు జరిగాయి.. వారి మెడలోని గొలుసులను కొల్లగొట్టారు. హైదరాబాద్ లోని చాలా ఏరియాల్లో ఒకే రోజు దాదాపు 11మంది మహిళలపై గొలుసులు తస్కరించారు. ఇందులో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అత్త సత్యవతి (76) మెడలోని గొలుసును దొంగలు ఎత్తుకెళ్లడం విశేషం.
ఢిల్లీ, హరియాణా నుంచి వచ్చిన కొంతమంది గొలుసు దొంగల ముఠానే ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానించారు. నిజామాబాద్లో పోలీసులు ఓ గొలుగు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.