
పూరి జగన్నాథ్ సినిమాలో 3 నెలల్లోపే పూర్తి చేసే జట్ స్పీడ్ డైరెక్టర్.. మహేశ్ లాంటి సూపర్ హీరో సినిమాను కూడా కేవలం 72 రోజుల్లో పూర్తి చేసి బిజినెస్ మాన్ గా అందించాడు పూరి జగన్నాథ్.. ఈ డైరెక్టర్ వేగం ఖచ్చితత్వం నచ్చే.. చిరంజీవి రాంచరణ్ ను చిరుతతో పూరితోనే లాంచ్ చేయించారు..
ఇప్పుడు పూరికి మరో బంపర్ ఆఫర్ దక్కింది. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు అయిన నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేసేందుకు పూరికి చాన్స్ దక్కింది.. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా లోఫర్ తెరకెక్కిస్తున్న పూరి.. ఇది పూర్తయిన తర్వాత నిఖిల్ గౌడను లాంచ్ చేయనున్నట్టు సమాచారం.