Breaking News

-మాకు కేసీఆర్ లాంటి సీఎం కావాలి..

01kcr

-సీమాంధ్ర‌లో కూడా కేసీఆరే హీరో! -చంద్రబాబు పనితీరుపై అసంతృప్తి -ఓ సర్వేలో వెల్లడి… -హైదరాబాద్ లో సీమాంధ్రుల హ్యాపీ..
టైటిల్‌లో కెసిఆర్ పేరు చూసి ఇది తెలంగాణ ఇష్యూ అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్లే… నిజానికి ఇది సీమాంధ్ర ప్ర‌జ‌ల డిమాండ్. అవున‌న్నా, కొంద‌రు కాద‌న్నా… కెసిఆర్ ఇప్పుడు చాలా రాష్ట్రాల‌కు రోల్‌మోడ‌ల్ అయిపోయారు. ఉద్య‌మం చేయ‌డంతోనే తెలంగాణ‌లోనే కాదు దేశ‌ప్ర‌జ‌ల దృష్టిలో కూడా హీరో అయిపోయిన కెసిఆర్ సీమాంధ్ర ప్ర‌జ‌లకూ హీరోనేన‌ట‌…
ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత చంద్ర‌బాబు ఎక్కువ‌శాతం విదేశాల బాట‌లోనే ఉన్నార‌ని సీమాంధ్ర ప్ర‌జ‌లు ఫీల‌వుతున్నారు. టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఒప్పుకోకున్నా సీమాంధ్ర ప్ర‌జ‌ల్లో చాలామంది ఫీలింగ్ ఇది. ఇప్పుడు కూడా బాబు జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లోనే ఉన్నారు. సింగ‌పూర్‌, మ‌లేషియా, జ‌పాన్ దేశాల‌ను వ‌రుస‌గా చుట్టిన చంద్ర‌బాబు ఇప్ప‌టిదాకా చేసిందే్ంటి అని సీమాంధ్ర ప్ర‌జ‌లు బేరీజు వేసుకుంటే మార్కులు చాలా త‌క్కువ‌గా వ‌చ్చాయ‌ట‌… రాజ‌ధాని, కొత్త ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, ఉపాధి క‌ల్ప‌న విష‌యాల్లో చంద్ర‌బాబు మాట‌ల్లోనే త‌ప్ప ఇంత‌వ‌ర‌కూ చేత‌ల్లోకి వ‌చ్చింది మాత్రం చాలా త‌క్కువ అనేది సీమాంధ్ర అంటే ఇప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఫీలింగ్.
చంద్ర‌బాబు ప‌నితీరును అంచ‌నా వేస్తున్న స‌మ‌యంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రితో ప‌నితీరుతో కంపేర్ చేస్తున్నారు ఎపి ప్ర‌జానీకం. అయితే… ఆశ్చ‌ర్యంగా కెసిఆర్ లాంటి నేత త‌మ‌కు కావాలనుకుంటున్నార‌ట‌… అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒకే ఒక్క‌సారి విదేశీ ప‌ర్య‌ట‌న చేసన కెసీఆర్ చాలా పెట్టుబ‌డుల‌నే సాధించార‌ని సీమాంధ్ర ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ త‌ర్వాత ఐటి మ‌రియు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ఉన్న కెటిఆర్‌ను చూసి అబ్బుర‌ప‌డుతున్నారు వారు. హ్యాపెనింగ్ హైద‌రాబాద్‌లో త‌నదైన ముద్ర వేస్తూనే ఇటు విదేశీ కంపెనీల‌ను ఆక‌ర్షించ‌డంలో కెటిఆర్ నూటికి నూరు శాతం మార్కులు ప‌డుతున్నాయి సీమాంధ్ర ప్ర‌జ‌ల‌నుంచి. కానీ… స్వ‌యంగా త‌మ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనేక‌సార్లు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసినా…పెద్ద‌గా ఫ‌లితాలు క‌నిపించ‌లేద‌ని పెదవి విరుస్తున్నారు.
అంతెందుకు సంవ‌త్స‌రం కింద కరెంట్ క‌ట్‌ల‌కు మారుపేరుగా ఉన్న తెలంగాణకు పిపిఎ ఒప్పందాల‌ను ర‌ద్దుచేసి చంద్ర‌బాబు హ్యాండిచ్చినా… అస‌లు క‌రెంటే పోవ‌ట్లేద‌ని హైద‌రాబాద్‌నుంచి త‌మ‌వాళ్లు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌. ఏదేమైనా కెసిఆర్ హీరోనే అని వాళ్ల ఫీలింగ్! మొత్తానికి ఎప్పుడొచ్చామా కాద‌న్నాయ్యా… బుల్లెట్ దిగిందా లేదా… అన్న‌ట్లు ఎన్ని ప‌ర్య‌ట‌న‌లు చేసినా ఏం ఖ‌ర్మ‌… పెట్టుబ‌డులు సాధించ‌లేన‌ప్పుడు అనేదే సీమాంధ్ర ప్ర‌జ‌ల మూగ‌రోద‌న‌!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *