
గత వారం రోజుల నుంచి కరీంనగర్ నగర వాసులపై ఆకాశం నుంచి కరపత్రాల వాన కురుస్తోంది. ఒక చిన్న చార్టెడ్ ఫ్లైట్ (బుల్లి విమానం) ఆకాశంలో విహరిస్తూ సిటీ అంతటా కరపత్రాలను వర్షం లా జల్లుతోంది..విమానం కరీంనగర్ నగరంపై చక్కర్లు కొడుతుండడంతో జనం రోడ్లపైకి వచ్చి ఆసక్తిగా చూస్తున్నారు. దాన్నుంచి వస్తున్న కరపత్రాలను చదువుతున్నారు.
కరీంనగర్ టవర్ సర్కిల్ లో కొత్తగా ప్రారంభమైన మాంగళ్య ఫ్యామిలీ బట్టల షోరూం హంగామే ఇదంతా.. షోరూం ప్రారంభోత్సవాన్నికి నిర్వాహకులు చేతికి ఎముకే లేనట్టు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేశారు. ప్రముఖ వ్యాపారి ఓం నమశ్శివాయ కరీంనగర్ లో కొత్తగా ఒక బట్టల షోరూం మాంగళ్య పేరుతో లాంచ్ చేశారు. దీన్ని ఆదివారం ప్రముఖ సినీ నటి కాజల్ ప్రారంభించారు. దీని కోసం గతవారం రోజులుగా ఒక చిన్న విమానంతో సిటీ అంతటా ఆకాశం నుంచి కరపత్రాలను వెదజల్లారు. నగరంలో ఎక్కడ చూసినా మాంగళ్య ఫ్లెక్సీలే.. జీపులు, ఆటోల్లో ఎక్కడ చూసినా మాంగళ్య యాడ్ లే.. ఇంత భారీగా ప్రచారం చేశారు మాంగళ్య నిర్వాహకులు..