మహేశ్ తో రూ.55 కోట్ల డీల్

హైదరాబాద్, ప్రతినిధి : సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అదే ఆయనకు క్రేజ్ ను తెచ్చిపెట్టింది.  మహేష్ తో కనీసం ఒక్క సినిమా అయినా చేసి, క్యాష్ చేసుకోవాలని భావిస్తుంటారు నిర్మాతలు. మహేష్ తో సినిమా చేయడానికి ఎంతైనా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతారు. లేటెస్ట్ గా పి.వి.పి సంస్థ అధినేత పొట్లూరి వరప్రసాద్ జాక్ పాట్ కొట్టాడని టాక్. మహేష్ తో ఏకంగా మూడు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడని సమాచారం.

మహేష్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ చేసే మూడు సినిమాలను ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ పొట్లూరికి దక్కిందని సమాచారం. దీనికి గాను మహేష్ కు దాదాపు రూ.55కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నాడని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూడు సినిమాలు శ్రీకాంత్ అడ్డాల, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేయనున్నాడు. మహేష్ ఇంతకు ముందు కూడా 14 రీల్స్ బ్యానర్ తో అగ్రిమెంట్ చేసుకుని.. దూకుడు, వన్-నేనొక్కడినే, ఆగడు సినిమాలు చేశాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.