
తమిళ హీరోలందరూ బోటాబోటిగా తెలుగు నేర్చుకొని వచ్చిరాని పదాలతో తెలుగు లో తమిళ సినిమాలను విడుదల చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇన్నాళ్లకు మన తెలుగు తేజం ప్రిన్స్ మహేశ్ తమిళనాట తన తొలి సినిమాను విడుదల చేస్తున్నారు. నిన్న తమిళనాడు చైన్నైలో ఆడియో వేడుక జరిగింది.. అక్కడ మహేశ్ మాట్లాడిన తీరు చూసి తమిళ జనం , తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు ముక్కున వేలేసుకున్నారు…
మహేశ్ బాబు తమిళ శ్రీమంతుడు ఆడియోలో అచ్చు తమిళ తంబిలా అనర్గళంగా తమిళంలో మాట్లాడేశాడు.. ఎంతో గొప్ప తమిళం తెలిసిన వాడిలా మట్లాడేసరికి అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.
అసలు విషయంలోకి వస్తే మహేశ్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ క్రిష్ణతో కలిసి చెన్నైలోనే ఉండేవాడు.. అప్పుడు హైదరాబాద్ కు ఇండస్ట్రీ రాలేదు.. చైన్నై కేంద్రంగానే తెలుగు సినిమాలు రూపొందేవి.. దీంతో మహేశ్ లు తన బాల్యం, చదువంతా చైన్నైలోనే గడిపాడు.. దీంతో తమిళం మహేశ్ కు బాగా వచ్చు.. అందుకే శ్రీమంతుడు ఆడియోలో తమిళంలో ఇరగదీశాడు..